బిగ్ బాస్ బుల్లితెరపై సూపర్ హిట్ షో. ఆల్ లాంగ్వేజెస్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ప్రోగ్రాం బిగ్ బాస్, చాలా సీజన్స్ నుండి రన్ అవుతుంది. అయితే ఈ బిగ్ బాస్ షో నుండి నార్త్ లో కొంతమంది స్టార్స్ అయ్యారు. తమిళనాడులో కొంతమంది లైం లైట్ లోకి వచ్చారు. బట్ తెలుగు బిగ్ బాస్ లో మాత్రం ఆ షో రన్ అయినంత వరకు షో లో ఉండడము, తర్వాత కాసేపు ఛానల్స్ లో కనిపించడం తప్ప ఇప్పటివరకు ఫస్ట్ సీజన్ లో విన్ అయిన శివ బాలాజీ కానీ, సెకండ్ సీజన్ లో కౌశల్ కానీ, మూడో సీజన్ రాహుల్ సిప్లిగంజ్ కానీ, ఇప్పుడు రీసెంట్ గా సీజన్ 4 అభిజిత్ కానీ వీళ్ళందరికీ ఆఫర్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ దక్కడం లేదు. అభిజిత్ బిగ్ బాస్ నుండి విన్నర్ గా బయటికి వచ్చాక నాలుగైదు ఆఫర్స్ వచ్చాయని ప్రచారం జరిగినా అందులో ఏ ఒక్కటి ఫైనల్ అయిన దాఖలాలు లేవు.
కేవలం బిగ్ బాస్ షోలో హడావిడి, బయటికొచ్చాక ఛానల్స్ హడావిడి తప్ప కెరీర్ లో హడవిడిగా షూటింగ్స్ చేసుకున్నదే లేదు. ఏదో స్టార్ మా మేము బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి లైఫ్ ఇస్తున్నాం అంటూ ఏవేవో ప్రోగ్రామ్స్ ని స్టార్ మా లో ప్లాన్ చేస్తుంది. బిగ్ బాస్ ఉత్సవం అంటూ బిగ్ బాస్ సీజన్ 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 కంటెస్టెంట్స్ తో ఓ జాతర కి ప్లాన్ చేసింది. దానితో నాలుగు సీజన్స్ కంటెస్టెంట్స్ ఒకే స్టేజ్ మీద గోల గోల. అభిజిత్, కౌశల్, శివ బాలాజీ, రాహుల్ సిప్లిగంజ్ లు ఒకే ఫ్రేమ్ లో సందడి చెయ్యగా.. శ్రీముఖి అభిజిత్ యాంకర్స్ గా ఈ షో లో హడావిడి కనబడుతుంది. మరి ఇలా స్టార్ మా షోస్ తప్ప బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పెద్దగా ఫేమ్ లోకి రావడం లేదు. ఇక ఈ సీజన్ సభ్యులు ఏవో సినిమాలు చేస్తున్నారన్నారు. మరి ఆ సినిమాలు విడుదలైతే కానీ వారి భవితవ్యం ఏమిటో తెలియదు.