పాలిటిక్స్ లోకి వెళ్ళినప్పటినుండి డీలా పడ్డ అల్లు అరవింద్ ఈ బన్నీ వాస్, యువి క్రియేషన్స్ ఇలాంటి వాళ్ళతో కోలబ్రెట్ అయ్యి ఏవో సినిమాలు చేస్తూ వస్తున్నా కూడా మెగా రేంజ్ ప్రాజెక్ట్స్ అయితే గీత ఆర్ట్స్ బ్యానర్ లో రావడం లేదు. చిరంజీవి పాలిటిక్స్ నుండి మళ్ళీ సినిమాల్లోకి వచ్చినప్పుడు గీత ఆర్ట్స్ లోనే చిరు సినిమాని ప్లాన్ చేస్తున్న అల్లు అరవింద్ కి షాకిస్తూ కొణిదెల ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసాడు రామ్ చరణ్. ఓన్ ప్రొడక్షన్ లోనే ఆ సినిమా చేసుకున్నారు చిరు - రామ్ చరణ్ లు.
కనీసం తర్వాత సినిమా అయినా గీత ఆర్ట్స్ లో సినిమా ఉంటుంది అనుకుంటే సై రా సినిమా అలాగే లేటెస్ట్ ఆచార్య సినిమాలను కొణిదెల ప్రొడక్షన్స్ లోనే చేసుకుంటున్నారు. సో చిరంజీవి డేట్స్ దొరకని పరిస్థితి వచ్చింది అల్లు అరవింద్ కి. అటు కొడుకు స్టార్ హీరో అయినా కొడుకుతో డైరెక్ట్ సినిమా సెట్ అవడం లేదు. చేసేది ఏమి లేక అన్ని సినిమాలు కాంబినేషన్స్ లో చెయ్యాల్సి వస్తుంది తప్ప సోలోగా సినిమా అవకాశం మాత్రం రావడం లేదు. సరే అని ఎప్పుడూ కొత్త ప్రాజెక్ట్స్ చేసే అల్లు అరవింద్ ఆహా అనే ఒక ఓటిటి పెట్టుకుంటే.. ఫాదర్ అఫ్ ద నేషన్ గాంధీజీ లాగా ఫాదర్ అఫ్ ది తెలుగు ఓటిటి మా డాడీ అంటూ అల్లు అర్జున్ అంత హైప్ ఇచ్చినా అది కామెడీ అయ్యిందే తప్ప వర్కౌట్ కాలేదు.
ఇప్పటికి మెగా సినిమాల డిస్ట్రిబ్యూషన్ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. తన చేతిలో ఉన్న హీరోలతో సినిమాలు చేసుకోలేకపోతున్నాడు. మెగా హీరోలు కూడా అల్లు అరవింద్ ని లైట్ తీసుకుంటున్నారు. మరి ఎప్పటినుండో ఇలా హాఫ్ మీల్స్ తోనే అల్లు అరవింద్ సరిపెట్టుకుంటున్నాడు. కానీ ఫుల్ మీల్స్ మాత్రం దొరకడం లేదు.