Advertisementt

ప్రభాస్ కి షాకుల మీద షాకులు

Tue 02nd Feb 2021 10:53 PM
prabhas,salaar movie,adipurush movie,pan india movies,salaar unit,road accident,salaar unit road accident  ప్రభాస్ కి షాకుల మీద షాకులు
Prabhas Salaar unit road accident ప్రభాస్ కి షాకుల మీద షాకులు
Advertisement
Ads by CJ

ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ ని వరస బెట్టి మొదలు పెట్టడమే కాదు.. అందుకు తగిన ప్రణాళికలతో బరిలోకి దిగుతున్న ప్రభాస్ కి ఒకే ఒక్క రోజు షాకుల మీద షాకులు తగిలాయి. ఎంతో ఉత్సాహంతో ముంబై వెళ్లి అక్కడ ఓ స్టూడియోలో వేసిన సెట్ లో ఆదిపురుష్ సినిమాని గ్రాండ్ గా ఓపెనింగ్ చేద్దాం అనుకున్న ప్రభాస్ కి ఆదిపురుష్ సెట్ లో ఫైర్ ఆక్సిడెంట్ జరగడం షాకిచ్చింది. ఆదిపురుష్ ఓపెనింగ్ కి అటు ఇటుగా ఆదిపురుష్ షూటింగ్ కోసం వేసిన ఓ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో ఆదిపురుష్ ఓపెనింగ్ ని హడావిడి లేకుండా ముగించేసింది ఓం రౌత్ టీం. ఇక ఆదిపురుష్ సెట్ దగ్ధం అయినా.. అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రభాస్ అండ్ ఆదిపురుష్ టీం ఊపిరి పీల్చుకుంది.

ఆ గొడవ ఇంకా సద్దు మణగక ముందే ప్రభాస్ కి మరో షాక్ తగిలింది. అదేమిటి అంటే ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ షూటింగ్ ముగించుకుని వెళుతున్న సలార్ టీం సభ్యులు రీసెంట్ గా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గోదావరి ఖని - పెద్దపల్లి లోని సింగరేణి బొగ్గు గనుల్లో సలార్ షూటింగ్ జరుగుతుంది. అయితే అక్కడ షూటింగ్ ముగించుకుని వెళుతున్న టెక్నీకల్ సిబ్బంది వ్యాను హైవే మీద యూటర్న్ తీసుకుంటుండగా.. లారీ గుద్దడంతో సలార్ టెక్నీకల్ సిబ్బందిలో ఐదుగురు గాయాలపాకలవగా.. వారిని దగ్గర్లోనే ఉన్న మమత హాస్పిటల్ లో జాయిన్ చేసారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం కలగకపోవడంతో సలార్ టీం ఊపిరి పీల్చుకుంది. మరి ఒకే రోజు రెండు భారీ పాన్ ఇండియా మూవీస్ షూటింగ్ విషయంలో ఇలా జరగడం నిజంగా ప్రభాస్ కి పెద్ద షాకే.

Prabhas Salaar unit road accident:

Prabhas is really shocked that this happened in the shoots of his two huge Pan India movies in one day

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ