Advertisementt

ఈ కాంబినేషన్ అదరహో..!

Tue 02nd Feb 2021 10:11 PM
kiara advani,romance,ntr,trivikram,ntr30  ఈ కాంబినేషన్ అదరహో..!
Kiara Advani to romance Ntr ఈ కాంబినేషన్ అదరహో..!
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో మొదలు కాబోయే NTR30 లో హీరోయిన్ గా పూజ హెగ్డే నే రిపీట్ చేస్తారు అని అందరూ అనుకుంటున్నారు. ఈవెన్  పూజ హెగ్డే కూడా త్రివిక్రమ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. తననే ఎన్టీఆర్ సినిమాలో రిపీట్ చేస్తారని. కానీ తారక్ వైపు నుండి హీరోయిన్ చేంజ్ ఆబ్లిగేషన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం ఓ కొత్త భామని ఎన్టీఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నాడనే న్యూస్ స్టార్ట్ కావడం, మధ్యలో ఓ డెబ్యూ హీరోయిన్ ని ఎన్టీఆర్ 30 కి తగిలించడంతో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ హీరోయిన్ గా కొత్త అమ్మాయి ప్రచారంలోకొచ్చింది. కానీ రీసెంట్ గా ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ బాలీవుడ్ భామ కియారా అద్వానీని సంప్రదిస్తున్నాడట. కియారా తో సంప్రదింపులు జరిపి ఫైనల్ అయిపోతే ఎన్టీఆర్ కి జోడిగా కియారా ఫిక్స్ అవుతుంది. ఈ కాంబినేషన్ అదిరిపోతోంది అంటున్నారు ఫాన్స్.

ఇక కియారా ని త్రివిక్రమ్ కావాల్సినట్టుగా అంటే గ్లామర్ గా చూపించడం ఖాయం. సమంత, ఇలియానా, పూజ హెగ్డే గ్లామర్ ని బాగా వాడిన త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ కోసం కియారా కనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. కియారా అందాలను త్రివిక్రమ్ కొత్తగా చూపించడం ఖాయం. త్రివిక్రమ్ తన కంటెంట్ తో పాటుగా హీరోయిన్స్ గ్లామర్ ని ఓ రేంజ్ లో వాడేసే విషయం అందరికి తెలిసిందే. ఇప్పటివరకు త్రివిక్రమ్ నుండి వచ్చిన సమంత, ఇలియానా, పూజ హెగ్డే అందాలు చూసిన ఫాన్స్, ప్రేక్షకులు ఇప్పుడు కియారా గ్లామర్ ని త్రివిక్రమ్ స్టయిల్లో చూడబోతారు. మరి ఎన్టీఆర్ - కియారా అద్వానీ కాంబో సెట్ అయితే మాత్రం ఈ కాంబో అదరహో అనాల్సిందే.

Kiara Advani to romance Ntr:

Kiara Advani to romance Ntr in NTR30

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ