Advertisementt

పవన్ వైఫ్ గా సాయి పల్లవి ఫిక్స్

Mon 01st Feb 2021 06:00 PM
sai pallavi,wife,pawan kalyan,ak remake,ayyappam koshiem movie remake,sekhar k chandra,sitara,pawan wife  పవన్ వైఫ్ గా సాయి పల్లవి ఫిక్స్
Sai Pallavi As Pawan Kalyan Wife పవన్ వైఫ్ గా సాయి పల్లవి ఫిక్స్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో తెరకెక్కుతున్న అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ షూటింగ్ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన లాడ్జి సెట్ లో జరుగుతుంది. ఇప్పటికే అయ్యప్పన్ గా పవన్ లుక్ రివీల్ అయ్యింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వైఫ్ పాత్రకి సాయి పల్లవిని అనుకుంటున్నారని.. దాదాపుగా ఫిక్స్ అని కూడా అన్నారు. ఆతర్వాత సాయి పల్లవితో పారితోషకం దగ్గర పేచీ వచ్చింది కాబట్టి మహానటి కీర్తి సురేష్ ని ఏకే రీమేక్ దర్శకనిర్మాతలు సంప్రదిస్తున్నారనే ప్రచారం జరిగింది.

అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ వైఫ్ పాత్రకి సాయి పల్లవినే ఫిక్స్ చేశారట మేకర్స్. పవన్ భార్య గా డీ గ్లామర్ రోల్ లో సాయి పల్లవి ఏకే రీమేక్ లో కనిపించనుందట. మరి ఇలాంటి పాత్రలకి సాయి పల్లవి పెట్టింది పేరు. ఏకే రీమేక్ లో అయ్యప్పన్ భార్య ఓ బిడ్డని ఎత్తుకుని భర్త కోసం పోరాడే సన్నివేశాలు ఉంటాయి. పాత్ర నిడివి చిన్నదే అయినా.. ఆ కేరెక్టర్ పెరఫార్మెన్స్ పరంగా హైలెట్ అనేలా ఉంటుంది. సో ఇప్పుడు పవన్ వైఫ్ గా సాయి పల్లవి ఫిక్స్ అనగానే పవన్ ఫాన్స్ అబ్బా పవర్ స్టార్ తో నేచురల్ బ్యూటీ అంటే ఆ క్రేజే వేరు అంటున్నారు.

Sai Pallavi As Pawan Kalyan Wife:

Sai Pallavi Fix as Pawan Wife in AK Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ