గోపీచంద్ మలినేని.. ఈ దర్శకుడు పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. రవితేజ క్రాక్ తో బంపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని కి అవకాశాల వెల్లువ అనే న్యూస్ ఉంది చూశారూ సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇప్పటివరకు మీడియం హీరోలతోనే అడ్జెస్ట్ అయిన గోపీచంద్ కి మెగా కాంపౌండ్ నుండి, నందమూరి కాంపౌండ్ నుండి పిలుపు వచ్చింది అనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే చిరంజీవి గోపీచంద్ మలినేని కి శుభాకాంక్షలు తెలిపారు. క్రాక్ లాంటి మాస్ మసాలా సినిమాతో ఒక్కసారిగా లైం లైన్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని తో బాలయ్య.. బోయపాటి సినిమా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడని.. ఇప్పటికే గోపీచంద్ - బాలయ్య ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందని అంటున్నారు.
ఇక ఇప్పుడు గోపీచంద్ నేను చిరు గారిని డైరెక్ట్ చేయబోతున్నా అంటున్నాడు. అంటే చిరు తనతో సినిమా చేస్తానంటూ మాటిచ్చినట్లుగా గోపీచంద్ మాటలు ఉన్నాయి. మరి ఇప్పటికే నలుగురు దర్శకులతో కమిట్ అయిన చిరంజీవి లిస్ట్ లో ఇప్పుడు గోపీచంద్ మలినేని కూడా చేరబోతున్నాడన్నమాట. మరి కొరటాలతో ఆచార్య సినిమా, మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్, మెహెర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం రీమేక్, ఆతర్వాత బాబీ తో సినిమా అంటే మరో రెండేళ్ళకి గాని గోపీచంద్ కి చిరు దొరకరు. అంటే చిరు - గోపీచంద్ మలినేని మూవీ 2023 లో పట్టాలెక్కుతోంది అన్నమాట. ఈలోపు బాలయ్య మూవీ కంప్లీట్ చేసి, ఆ తర్వాత క్రాక్ బాలీవుడ్ మూవీని రీమేక్ చేస్తాడట గోపీచంద్. ప్లాన్ బాగానే ఉంది మరి వర్కౌట్ చేసుకోవడం గోపీచంద్ చేతుల్లోనే ఉంది అంటున్నారు.