సౌత్ లో హై స్టాండర్డ్స్ దర్శకుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలు ఈమధ్యన ఆ స్టాండర్డ్స్ గురించి చెప్పుకోవడమే కానీ.. ఆయన సినిమాలు హిట్ అవడం లేదు. రోబో తర్వాత మళ్ళీ హిట్ కొట్టలేని శంకర్.. కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీ మొదలు పెట్టారు. ఒకే ఒక్క షెడ్యూల్ తర్వాత ఆ షూటింగ్ కి భారీ బ్రేకిచ్చారు నిర్మాతలు. ఈ మధ్యన ఇండియన్ 2 షూటింగ్ మొదలు కాబోతుంది అనే వార్త వినిపించినా.. అది ఇంకా పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు దర్శకుడు శంకర్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవడం కోలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. చెన్నైలోని ఎగ్మూర్ లోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఆయనపై ఈ వారెంట్ జారీచేసింది.
శంకర్ పై ఈ కేసు ఎందుకు నమోదు అయ్యింది అంటే.. తాను రాసుకున్న జిగూబా కథ నుండి కాపీ కొట్టి శంకర్ రోబో సినిమాని తెరకెక్కించారంటూ అరుళ్ తమిళ నందన్ అనే తమిళ రచయిత గతంలో శంకర్ పై కేసు పెట్టాడు. అయితే ఆ కేసు తర్వాత శంకర్ కి కోర్టుకి హాజరు కావాలంటూ ఎన్నిసార్లు నోటీసు లు ఇచ్చినా శంకర్ కోర్టుకి హాజరు కాకపోవడంతో.. ఇప్పడు శంకర్ మీద కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. మరి ఈ కేసు విచారణని కోర్టు ఫిబ్రవరి 19 కి వాయిదా వేసింది.