మెగా హీరో వైష్ణవ తేజ్ ఉప్పెన లాక్ డౌన్ కన్నా ముందే రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కానీ లాక్ డౌన్ తో థియేటర్స్ బంద్ వలన ఉప్పెన పోస్ట్ పోన్ అయ్యి ఈ ఫిబ్రవరి 12 కి రిలీజ్ కి రెడీ అవుతుంది. లేదంటే మెగా హీరో భవితవ్యం ఉప్పెన తో ఎప్పుడో తేలిపోయేదే. ఉప్పెన సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు గట్టి పట్టుదల మీదే ఉన్నారు. అందుకే ఓటిటి నుండి మంచి ఆఫర్ వచ్చినా ఉప్పెనని అమ్మలేదు నిర్మాతలు. ఇక డిసెంబర్ లోనే సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యాయి కదా రిలీజ్ డేట్ ఇస్తారనుకుంటే.. నిన్నమొన్నటివరకు ఉప్పెన విషయం పక్కనబెట్టిన నిర్మాతలు సడన్ గా ఫిబ్రవరి 12 న విడుదల అంటూ డేట్ అనౌన్స్ చేసారో.. లేదో.. కేంద్ర థియేటర్ ఆక్యుపెన్సీ 50 శాతం నుండి పెంచుతున్నట్టుగా ప్రకటించారు.
అయితే 50 పర్సెంట్ నుండి మహా పెరిగితే మరో 25 శాతం పెరుగుతుంది అనుకుంటే కేంద్రం నిన్న అర్ధరాత్రి ఫిబ్రవరి 1 నుండి థియేటర్ ఆక్యుపెన్సీ 50 నుండి 100 శాతానికి పెంచుతూ ప్రకటన చెయ్యడంతో ఇన్నాళ్లుగా ఆగిన ఉప్పెనకి థియేటర్స్ లో 100 శాతం ప్రేక్షకులు వచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. దానితో ఉప్పెన నిర్మాతలు హ్యాపీ గా ఉన్నారు. ట్రేడ్ లోను మంచి బజ్ ఉన్న ఉప్పెన.. 100 శాతం ప్రేక్షులతో థియేటర్స్ ప్రేక్షకులు కళకళలాడుతుంటే దానిని బట్టే రెవిన్యూ కూడా ఉంటుంది. మరి వరసబెట్టి సినిమా డేట్స్ ఇచ్చినా ప్రస్తుతం 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ కోసం ఎదురు చూసిన నిర్మాతలు కేంద్రం నుండి వచ్చిన ప్రకటనతో ఫుల్ ఖుషీలో ఉన్నారు.