జనవరి 25 న రాజమౌళి RRR రిలీజ్ డేట్ ని గ్రాండ్ గా రిలీజ్ చేసారు. రామ్ చరణ్ -ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న RRR అక్టోబర్ 13 న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. తర్వాత రెండు రోజులు సోషల్ మీడియాలో RRR రిలీజ్ డేట్ హంగామానే నడిచింది. కానీ జనవరి 28 ఉదయం సడన్ గా అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాడు. బన్నీ అలా పుష్ప రిలీజ్ డేట్ ఆగష్టు 13 అన్నాడో.. లేదో.. కొద్దిసేపటికే వరుణ్ తేజ్ గని రిలీజ్ డేట్ ఇచ్చేసారు. తర్వాత గోపీచంద్ సీటిమార్, F3 డేట్స్ వరసబెట్టాయి. అదే రిలీజ్ డేట్స్ జాతర జనవరి 29 న కొనసాగింది. ఆచార్య టీజర్ తో పాటుగా ఆచార్య విడుదల తేదీ కూడా ప్రకటించారు చిరు అండ్ కొరటాల. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదల తేదీ లాక్ చేసింది టీం.
అంతేకాకుండా అడివి శేష్ మేజర్ అప్ డేట్ ని దింపాడు మహేష్ బాబు. జులై 2 న మేజర్ రిలీజ్ అంటూ అనౌన్స్ చేసారు. ఇక వెంకటేష్ నారప్ప కూడా మే 14 న విడుదలకు డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక అదే రిలీజ్ డేట్స్ హంగామా జనవరి 30 కూడా కొనసాగుతూనే ఉంది. జనవరి 30 శర్వానంద్ - సిద్దార్థ్ కాంబోలో అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహాసముద్రం ఆగష్టు 19 అంటూ రిలీజ్ డేట్ ఇచ్చేసింది. ఇంతలోపులో రవితేజ ఖిలాడీ విడుదల తేదీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇక రేసులో వెనుక బడ్డాడు వెనుక బడ్డాడు అంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అప్ డేట్ కూడా వచ్చేసింది. పవన్ వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న రిలీజ్ డేట్ ఇవ్వగానే పవన్ ఫాన్స్ పండగ చేసుకోవడం మొదలుపెట్టేసారు.
మరి బన్నీ మొదలు పెట్టిన ఈ విడుదల డేట్ జాతర పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదల తేదీతో తో ఫుల్ స్టాప్ పడుతుంది అనుకునేలోపు.. బాలయ్య - బోయపాటి BB3 అప్ డేట్ ఆన్ ది వే అంటూ ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అంటే బాలయ్య - బోయపాటి కాంబో టైటిల్ రివీల్ చేస్తారా? లేదంటే అందరిలాగే రిలీజ్ డేట్ ఇచ్చి షాకిస్తారా? జస్ట్ వెయిట్ అండ్ సి.