మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయిన కీర్తి సురేష్.. జాతీయ ఉత్తమనటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ మొదటి సినిమా ఇంకా ల్యాబ్ లోనే ఉంది. సీనియర్ నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా చంటి అడ్డాల నిర్మాతగా మొదలైన సినిమా ఎందుకో ఇప్పటివరకు రిలీజ్ కి నోచుకోలేదు. ఇప్పుడు ఇదే సినిమాని గతంలో నరేష్ - శుభలేఖ సుధాకర్ హీరోలుగా తెరకెక్కి సూపర్ హిట్ అయిన రెండు జెళ్ళ సీత సినిమా టైటిల్ ని పట్టుకుని కీర్తి సురేష్ - నవీన్ విజయ్ కృష్ణ కాంబో సినిమాకి రెండు రెళ్ళ సీత అనే టైటిల్ పెట్టి విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
మరి అప్పట్లో నరేష్ - శుభలేఖ సుధాకర్ నటించిన రెండు జెళ్ళ సీత మంచి హిట్ అయ్యింది. ఎపుడో రిలీజ్ కావాల్సిన సినిమా కి ఇప్పుడు ఆ క్లాసిక్ హిట్ టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తే హిట్టైపోతుందా? అప్పట్లో మంచి హిట్ కొట్టిన రెండు జెళ్ళ సీతలాగా ఇప్పుడు కీర్తి సురేష్ మొదటి సినిమా రెండు జెళ్ళ సీత కూడా అంతే హిట్ అవుతుందా..? మరి కీర్తి సురేష్ స్టార్ హీరోగా సినిమాలతో బిజీగా ఉన్న టైం లో ఇప్పుడు ఆమె మొదటి సినిమాని విడుదల చేసి ఆమె క్రేజ్ తో కలెక్షన్స్ రాబట్టాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.