హీరోగా లాంచ్ అయిన దగ్గరనుండి సరైన సక్సెస్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తునే ఉన్నాడు అక్కినేని హీరో అఖిల్. రాబోయే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మీద చాలా హోప్స్ తో ఉన్నాడు. ఆ సినిమా అఖిల్ కి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది అని అందరూ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్, అల్లు అరవింద్, బన్నీ వాస్ అలాంటి సేఫ్ హాండ్స్ లో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి. పైగా బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలా గ్యాప్ తో చాలా కసితో చేస్తున్న సినిమా కాబట్టి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది అని అందరూ నమ్ముతున్నారు. అలాగే రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ చేసిన సమంత ఆ డైరెక్టర్స్ రాజ్, డీకే వర్కింగ్ స్టయిల్ చూసి అఖిల్ తో సినిమా చెయ్యమని అడిగింది అనే వార్తలు మీడియాలో ఆల్రెడీ గుప్పుమన్నాయి.
మరిది కోసం వదిన ఆ ప్రాజెక్ట్ సెట్ చేసింది అంటూ న్యూస్ లు బయటికి వచ్చాయి. ఆ విషయం అలా ఉంచితే.. రీసెంట్ గా లవ్ స్టోరీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన నాగ చైతన్య.. ఆ సినిమా అవుట్ ఫుట్ చూసాక శేఖర్ ఖమ్ములని పర్సనల్ గా ఒక రిక్వెస్ట్ చేసాడట. అఖిల్ తో ఓ సినిమా చెయ్యండి అని. అఖిల్ తో ఇలాంటి ఓ మంచి సెన్సిబుల్ లవ్ స్టోరీ చెయ్యండి అని రిక్వెస్ట్ చేసాడట. ఆ సినిమాని మేము అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే ప్రొడ్యూస్ చేస్తాము. కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఇస్తాము.. మీ ఇష్టం.. సినిమా చెయ్యమని రిక్వెస్ట్ చేసాడట.
మరి అఖిల్ కోసం అటు అన్న ఇటు వదిన ఇద్దరూ రెండు ప్రాజెక్ట్స్ సెట్ చెయ్యడం చూస్తే.. అఖిల్ మీద అన్నా-వదినల ప్రేమలు అద్భుతం అంటారు.