రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోస్ ఎన్టీఆర్ - రామ్ చరణ్, కొమరం భీం - రామరాజులుగా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రామ రాజుగా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ లుక్స్ ఇప్పటికే ఫాన్స్ కి ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసాయి. ఆర్ ఆర్ ఆర్ భీం, రామ రాజు వీడియోస్ ఫాన్స్ కి కిక్కిచ్చాయి. హెవీ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా ఆర్ ఆర్ ఆర్ ఉండబోతుంది అనేది ఆ వీడియోస్ తోనే స్పష్టమైంది. అయితే ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో కలిసి నటిస్తున్న ఎన్టీఆర్ అండ్ తారక్ లు.. తన నెక్స్ట్ సినిమాల విషయంలో కంప్లీట్ క్లారిటీతో ఉన్నారు. ఇద్దరూ ఓకె ప్లాన్ లో ఉన్నారు.
అదేమిటి అంటే ఆర్ ఆర్ ఆర్ లాంటి హెవీ యాక్షన్ ఫిలిం చేసాక ఆ ఎమోషనల్ కేరెక్టర్స్ నుండి బయటికి రావడానికి ఒక లైట్ రివీల్ కేరెక్టర్, ఒక ఎంటర్టైనింగ్ ఫిలింని ఛూజ్ చేసుకోవాలని ఇద్దరూ ఫిక్స్ అయ్యారు. తారక్ కూడా త్రివిక్రమ్ కి చెప్పింది అదే. ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం, ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం విత్ లైటర్ వీన్ కేరెక్టర్. ఇక రామ్ చరణ్ కి ఉన్న ఆబ్లికేషన్ రీత్యా.. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆచర్యలో కూడా ఓ గెస్ట్ రోల్ చెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు చరణ్ కూడా అందులో నుండి బయటికి రావడానికి కంటిన్యూస్ గా కథలు వింటున్నాడు. వెంకీ కుడుముల, అనిల్ రావిపూడి ఇలా పలువురు దర్శకులను హోల్ సం ఎంటెర్టైనెర్ కావాలంటూ అడుగుతున్నాడు.
తనని ఆ ఎమోషనల్ కేరెక్టర్ లో నుండి బయటికి తీసుకువచ్చి ఒక ఎంటర్టైనింగ్ రోల్ తో మళ్ళి ప్రెజెంట్ చేసే డైరెక్టర్ కోసం వెయిటింగ్. రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ కూడా తొందరలోనే వచ్చేస్తుంది.