30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే కథ ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోల దగ్గరికి వెళ్లి చివరిలోకి యాంకర్ ప్రదీప్ మాచిరాజు దగ్గర ఆగిందట. ప్రదీప్ కి ఈ కథ నచ్చి తాను హీరోగా వెండితెరకు లాంచ్ అవడానికి పర్ఫెక్ట్ సినిమా అనుకున్నాడు. అందుకే పారితోషకం లేకుండా ఈ సినిమాని చేసాడు. ఆ విషయాన్ని ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలోచెప్పాడు ప్రదీప్. పారితోషకం త్యాగం చేసి మరీ ఈ సినిమా చేసినట్టు.. సినిమా విడుదలై.. సూపర్ హిట్ అయ్యి నిర్మాతలు సేఫ్ అయిపోయి, లాభాలొస్తే.. అప్పుడు పారితోషకం తీసుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు.
కానీ ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కనీసం మిక్స్డ్ టాక్ వచ్చినా నిర్మాతలు సేఫ్ అయ్యేవారు. సినిమా మొదలు పెట్టినప్పటినుండి నీలి నీలి ఆకాశం సాంగ్ చూపించి సినిమాపై హైప్ క్రియేట్ చేసారు. సినిమా విడుదల అయ్యేవరకు ఆ ఒక్క సాంగ్ మీదే క్రేజ్ పెంచుతూ సినిమాని ప్రేక్షకులకి చూపించేసారు. కానీ సినిమాలో ఆ పాట తప్ప మరేమి లేదు. ప్రదీప్ హీరో గా ఓకె.. కానీ సినిమాలో బలం లేదు.. కొత్త డైరెక్టర్ మున్నా మేకింగ్ చెత్త అంటూ ప్రేక్షకుల కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం తప్ప 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో చెప్పుకోవడనికి ఒక్క ముక్క లేదని తేల్చేసారు సినీ విశ్లేషకులు.