ఏపీ పంచాయితీ ఎన్నికలు షురూ అయ్యాయి. నిమ్మగడ్డ పంచాయితీ ఎన్నికల కోసం ఒంటి చేతితో పోరాడి ఎట్టకేలకు నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు.. నామినేషన్స్ స్వీకరణ కూడా మొదలు పెట్టేసారు. మూడు దశల్లో ఏపీ పంచాయితీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరక్కూడదు, నిమ్మగడ్డ ఎలక్షన్స్ పెడితే మేము సహకరించం అంటూ ఏపీ ప్రభ్భుత్వం, ఉద్యోగులు కోర్టుకు వెళ్లినా పని జరగలేదు. కోర్టు ఎన్నికలు జరగాల్సిందే అంటూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కనిపించడం లేదు. కారణం ఏపీ ప్రభుత్వానికి-SEC నిమ్మగడ్డను మధ్యన పొసగడం లేదు. నిమ్మగడ్డ ఏం చేసినా టిడిపికి అనుకూలంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారంటూ వైసిపి నేతలు రెచ్చిపోతున్నారు. ఏపీ ప్రభుత్వంపై నిమ్మగడ్డ కూడా ఒంటి కాలు మీద లేస్తున్నారు. వైసిపి అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ లు విధి నిర్వహణలో విఫలమయ్యారంటూ నిమ్మగడ్డ వారిని విధుల నుండి తప్పించాలంటూ కేంద్రానికి లేఖ రాస్తే.. నిమ్మగడ్డకి పిచ్చెక్కింది, నిమ్మగడ్డని మెంటల్ హాస్పిటల్ కి తరలించాలంటూ వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారు.
ఇంకా నిమ్మగడ్డ టిడిపి పక్షాన ఉన్నారని, చంద్రబబు కి అధికార పార్టీ ప్రతినిధి నిమ్మగడ్డ అని, చంద్రబాబు ఆడించే కీలు బొమ్మలా నిమ్మగడ్డ మారిపోయారని, చంద్రబాబు అయితే చంద్రముఖిలా మారిపోయి లకలక అంటూ నాన హంగామా చేస్తున్నారంటూ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలకు టిడిపి కార్యకర్తలు కూడా పర్ఫెక్ట్ గా తిప్పికొడుతున్నారు. మా చంద్రబాబు చంద్రముఖి అయితే మరి మీరు.. మీరు రాఘవ లారెన్స్ కాంచనలా నాలుగు కేరెక్టర్స్ లోకి దూరి నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే మీరు కాంచనానా అంటూ విజయసాయి రెడ్డి పై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు - వైపీసీ నేతలు అన్నట్టుగానే కాకుండా వైసిపి vs SEC అన్నట్టుగా ఉన్నాయి ఏపీ రాజకీయాలు.