ఫిబ్రవరి నుండి థియేటర్స్ ఆక్యుపెన్సీ పెరగడం అనేది నిర్మాతలకు కాస్త ఉత్సాహాన్నిచ్చింది. ఊపొచ్చింది. ఇక సడన్ గా దిల్ రాజు జనవరి 28 న తాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఎఫ్ 3 సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చెయ్యడంతో పవన్ ఫాన్స్ ఒక్కసారిగా దిల్ రాజుపై విరుచుకుపడ్డారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తయ్యి రిలీజ్ కి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ రిలీజ్ డేట్ కాకుండా ఇప్పుడే షూటింగ్ మొదలు పెట్టుకున్న F3 రిలీజ్ డేట్ ముందే ప్రకటించడం ఏమిటా అని పవన్ ఫాన్స్ దిల్ రాజుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి పంపిణి రంగంలో, నిర్మాణ రంగంలో దిట్ట అయిన దిల్ రాజుకి ఇవన్నీ తెలియనివి కాదు. లాజిక్ ఏమిటి అంటే 50, 75 పర్సెంట్ ఆక్యుపెన్సీతో రిలీజ్ చెయ్యగల సినిమా కాదిది. ఈ నెల లేదంటే ఇంకో నెలలో నెలలో ఎప్పుడైతే థియేటర్స్ లో 100 శాతం అక్యుపెన్సీకి కేంద్రం ఆమోదం తెలుపుతుందో.. అప్పుడు అన్ని చూసుకుని వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఇవ్వాలని దిల్ రాజు ప్లాన్. ఎందుకంటే పవన్ రెమ్యునరేషన్ తో కలిపి అవధులు దాటిన బడ్జెట్ ని రాబట్టుకోవాలన్నా.. నష్టాలు పాలు కాకుండా, కష్టాలు కొని తెచ్చుకోకూడదు అనుకున్నా.. 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ వచ్చేవరకు వెయిట్ చెయ్యాలనేది దిల్ రాజు ఆలోచన.
వీరావేశంతో ట్వీట్స్ పెట్టే జనసైనికులు దిల్ రాజు ప్లాన్ ని అర్ధం చేసుకుంటే బెటరేమో..