Advertisementt

సైలెంట్ గా సర్ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్

Thu 28th Jan 2021 10:58 AM
allu arjun,pushpa raj,sukumar,pushpa pan india film,pushpa release date,august 13th 2021,big surprise  సైలెంట్ గా సర్ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్
Pushpa release date locked సైలెంట్ గా సర్ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో గత ఏడాది మార్చ్ లో మొదలవ్వాల్సిన పాన్ ఇండియా ఫిలిం పుష్ప ప్రస్తుతం మారేడుమిల్లు అడవుల్లో ఏకధాటి చిత్రీకరణలో బిజీగా వుంది. అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా మాస్ మసాలా పాత్రలో కనిపిస్తున్నాడు. హీరోయిన్ గా రష్మిక డీ గ్లామర్ రోల్ చేస్తున్న ఈ సినిమా విలన్ విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న పుష్ప టీం సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటుంది. అంత సైలెంట్ గా షూటింగ్ లో పాల్గొంటున్న పుష్ప టీం నుండి అనుకోని భారి సర్ప్రైజ్ వచ్చేసింది. అసలు పుష్ప నుండి ఇలాంటి భారీ అప్ డేట్ ఒకటి ఉండబోతుంది అనే అనుమానం ఏ ఒక్కరిలోనూ లేదు. అలాంటి టైం లో పుష్ప నుండి భారీ సర్ప్రైజ్ వచ్చి షాకిచ్చింది.

అది పుష్ప పాన్ ఇండియా మూవీని ఆగష్టు 13 2021 న థియేటర్స్ లో రిలీజ్ చేయ్యబోతున్నట్టుగా రిలీజ్ డేట్ ఇచ్చేసి షాకిచ్చేసారు. RRR ఎంతో హైప్ క్రియేట్ చేస్తూ రిలీజ్ డేట్ ఇవ్వగా అల్లు అర్జున్ పుష్ప టీం మాత్రం ఎలాంటి హడావిడి హంగామా లేకుండా పుష్ప డేట్ వదిలింది. ఆగష్టు 13 న అంటే మరో ఆరు నెలల్లో పుష్ప సినిమా థియేటర్స్ లో దిగబోతుంది. నిజంగా మెగా ఫాన్స్ కి, అల్లు అర్జున్ ఫాన్స్ ఇది పండగ లాంటి వార్తే.  ఆచార్య, కెజిఎఫ్, రాధేశ్యామ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు పుష్ప సినిమా ఈ ఏడాదికి ఉండకపోవచ్చు.. పాన్ ఇండియా మూవీ అందులో సుకుమార్ దర్శకుడు కాబట్టి షూటింగ్ లేట్ గానే అవుతుంది అనుకుంటున్న తరుణంలో అదిరి పోయే పోస్టర్ తో పుష్ప టీం ఇలా డేట్ అనౌన్స్ చేసి అందరికి షాకిచ్చేసింది.

Pushpa release date locked :

Allu Arjun - Sukumar Pushpa releasing on August 13th 2021

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ