Advertisementt

శృతిని కన్ఫర్మ్ చేసేసిన ప్రభాస్

Thu 28th Jan 2021 10:21 AM
shruti haasan,salaar movie,prashanth neel,confirmed,prabhas salaar,prabhas,salaar heroine  శృతిని కన్ఫర్మ్ చేసేసిన ప్రభాస్
Sruthi haasan to romance Prabhas శృతిని కన్ఫర్మ్ చేసేసిన ప్రభాస్
Advertisement
Ads by CJ

ప్రభాస్ వరస పాన్ ఇండియా సినిమాలపై ఎంత క్రేజు, ఆసక్తి ప్రేక్షకుల్లో ఉందో.. ఆయనతో నటించబోయే హీరోయిన్స్ విషయంలోనూ అంతే ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. ఇప్పటికే బాలీవుడ్ టాప్ నటి దీపికా పదుకొనె నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబోలో  తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరోయిన్ గా కన్ఫర్మ్ చెయ్యగా.. ఆదిపురుష్ లో ప్రభాస్ తో పోటీ పది నటించే సీత పాత్ర కోసం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కృతి సనన్ ని అనుకుంటున్నాడనే టాక్ బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో నడుస్తుంది. ఇక ప్రభాస్ మరో సినిమా కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో చేయబోతున్న సలార్ సినిమా అధికారికంగా మొదలైంది. ఇంకా రెగ్యులర్ షూట్ కి వెళ్ళని సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ పేరు పరిశీలనలో ఉందనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది.

అంతలోనే ప్రభాస్ సలార్ హీరోయిన్ శృతి హాసన్ అంటూ కన్ఫర్మ్ చేసేసాడు. నేడు శృతి హాసన్ పుట్టిన రోజు కావడంతో శృతి హాసన్ కి బర్త్ డే విషెస్ చెబుతూ తనతో సాలార్ సినిమాలో వర్క్ చేయడానికి ఆసక్తిగా ఉన్నా అంటూ ట్వీట్ చెయ్యడంతో సలార్ హీరోయిన్ గా శృతి హాసన్ అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే శృతి హాసన్ కొన్నాళ్ల గ్యాప్ తరవాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఆమె లుక్స్ పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ పడుతున్న వేళ సాలార్ లో ప్రభాస్ కి జోడిగా శృతి హాసన్ ని ప్రశాంత్ నీల్ ఎంపిక చేయడంపై ప్రభాస్ ఫాన్స్ గుర్రుగా ఉన్నారు.

Sruthi haasan to romance Prabhas:

Official: Shruti haasan confirmed for Prabhas Salaar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ