మెగాస్టార్ చిరు యంగ్ ఏజ్ లో వరస సినిమాలను చేసినట్టుగా.. ఇప్పుడు ఈ ఏజ్ లో సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకుంటున్నారు. తాను పని చెయ్యబోతున్న నలుగురు కెప్టెన్స్ అంటూ నలుగురు డైరెక్టర్స్ ని పరిచయం చేసారు చిరు. మరోపక్క తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఐదు సినిమాలు లైన్ పెట్టుకుని ఉంచుకున్నారు. అంటే అన్నదమ్ములు అనుకునే సినిమాల విషయంలో కమిట్ అవుతున్నారేమో అనే అనుమానము వస్తుంది. కారణం ఒక్కటే రీసెంట్ గా జనసేన ప్రముఖులు నాదెండ్ల మనోహర్ చేసిన సంచలన వ్యాఖ్యలే. ప్రజా రాజ్యం పెట్టి 18 సీట్లతో సరిపెట్టుకుని.. మధ్యలో కాంగ్రెస్ తో కలిసి రాజకీయాలు నడిపినా వర్కౌట్ అవ్వక మళ్ళీ సినిమాలు అంటూ రీ ఎంట్రీ ఇచ్చారు చిరు.
ఇక జనసేన పార్టీ పెట్టి వచ్చిన ఒకే ఒక్క సీటును కాపాడుకోలేక.. ఏపీ రాజకీయలతో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ వెనుక చిరు హస్తం ఉంది అంటూ నాదెండ్ల బయట పెట్టడం, జనసేన పార్టీతో చిరు కూడా ఉంటారు అనడంతో.. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరూ కలిసి చకచకా సినిమాలు చేసేసి.. మళ్ళీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఎమన్నా ప్లాన్ చేస్తున్నారా? అందుకే తోచిన సినిమాలు ఒప్పేసుకుంటున్నారా? పవన్ - చిరు కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నారా? వరస సినిమాలు కంప్లీట్ చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నదమ్ములు జనసేన పార్టీ తరుపున పోటీ చేస్తారా? అమ్మో నాదెండ్ల మాటలకు ఇప్పుడు వంద డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి.
టివి ఛానల్స్ అయితే ఏకంగా చిరు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.. త్వరలోనే ప్రకటన రాబోతుంది అందుకే నాదెండ్ల ద్వారా ఇలాంటి లీకులు వదులుతున్నారు.. చిరు రాక జనసేనకు ఎంత ప్లస్ అవుతుంది. ప్రజారాజ్యంలా మైనస్ అవుతుందా అంటూ ఏవేవో మాట్లాడుతున్నాయి. అసలు చిరు కానీ పవన్ కానీ ఈ విషయంపై ఎక్కడా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. పవన్ సినిమాల్లో బిజీగా వున్నప్పుడు జనసేన పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గుతుంది అని, చిరు పవన్ వెనుక వున్నారు. ఆయన సినిమాలు చెయ్యమంటేనే పవన్ సినిమాలు ఒప్పుకుంటున్నారు, రాజకీయాల్లోనూ పవన్ వెన్నంటే చిరు ఉంటారంటూ మనోహర్ మాట్లాడారా? పవన్ విదేశీ షూటింగ్స్ అంటూ రాజకీయాలకు దూరంగా ఉన్నపుడు జనసేన చుక్కాని లేని నావలా మారుతుంది అని మనోహర్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారా? లేదంటే మెగా కాంపౌండ్ లో చిరు రాజకీయాలకు రీ ఎంట్రీ ముచ్చట ఎమన్నా మొదలయిందా? ఏదైనా మెగా కాంపౌండ్ నుండి ఎవరో ఒకరు స్పందిస్తేనే కానీ దీనిపై ఓ క్లారిటీ అయితే వచ్చేలా లేదు.