Advertisementt

పునర్నవిని మర్చిపోయా అంటున్న రాహుల్

Wed 27th Jan 2021 07:43 PM
rahul,punarnavi,ashu reddy,rahul sensational comments,just friends  పునర్నవిని మర్చిపోయా అంటున్న రాహుల్
Rahul says he forgot Punarnavi పునర్నవిని మర్చిపోయా అంటున్న రాహుల్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 3 నుండి మొన్నటివరకు రాహుల్ సిప్లిగంజ్ - పునర్నవి భూపాలం మధ్యన లవ్ మేటర్ నడిచింది.. పెళ్లి కూడా షురూ అనుకున్నారు. బిగ్ బాస్ లో రాహుల్ పునర్నవితో ఆ రేంజ్ లో పులిహార కలిపాడు. తర్వాత కూడా పార్టీలు, పబ్బులు అంటూ రాహుల్ - పునర్నవీలు తిరగడంతో.. వాళ్ళ మధ్యన ప్రేమ ఉంది అనుకునే లోపు.. రాహుల్ సిప్లిగంజ్ మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం మరింతగా హైలెట్ అయ్యింది. రాహుల్ - అషు రెడ్డిలు లవ్ లో ఉన్నారని.. రాహుల్ - పునర్నవీలు బ్రేకప్ అయ్యారంటూ సోషల్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. అందులోను రాహుల్ ఈ మధ్యన ఓ బట్టల స్టోర్ ని ఓపెన్ చెయ్యడం అక్కడ అషు రెడ్డి తో క్లోజ్ గా ఉండడం.. ఆ ఓపెనింగ్ కి పునర్నవి రాకపోవడంతో అషు రెడ్డి - రాహుల్ లు ప్రేమలో ఉండడం వలనే పునర్నవి రాహుల్ ని అవాయిడ్ చేస్తుంది అని అంటున్నారు.

అయితే తాజాగా అదే ప్రశ్నని రాహుల్ సిప్లిగంజ్ ని అడిగితె.. అయ్యో అదేం లేదని.. నాకు పునర్నవికి ఎలాంటి గొడవ జరగలేదు.. నేను పునర్నవి మంచి ఫ్రెండ్స్, అసలు బట్టల షాప్ ఓపెనింగ్ ముందు రోజు చాలా స్ట్రెస్ ఫీలై తలనొప్పితో బాధపడుతూ చాలా టాబ్లెట్స్ మింగేసాను.. ఆ హడావిడీలోనే పునర్నవిని షాప్ ఓపెనింగ్ కి పిలవడం మర్చిపోయా అంటూ చాలా సింపుల్ గా పునర్నవి విషయాన్ని తేల్చేసాడు.

Rahul says he forgot Punarnavi:

Rahul sensational comments on Punarnavi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ