Advertisementt

రాజమౌళిని చూసి దడుచుకున్న నిర్మాత?

Wed 27th Jan 2021 04:54 PM
boney kapoor,rrr release date,october 13,maidan release date,october 15,rajamouli,rrr movie,maidaan vs rrr  రాజమౌళిని చూసి దడుచుకున్న నిర్మాత?
Boney Kapoor angry With Rajamouli రాజమౌళిని చూసి దడుచుకున్న నిర్మాత?
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న RRR సినిమా జనవరి 8 2021 లోనే విడుదలకు డేట్ ఇచ్చేసింది టీం. కానీ కరోనా తో RRR షూటింగ్ ఆగిపోవడం, మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టాక జక్కన్న తాజాగా RRR రిలీజ్ డేట్ లాక్ చేసి ప్రకటించారు. అక్టోబర్ 13 న దసరా టార్గెట్ గా RRR విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా రాజమౌళి ప్రకటించారు. అయితే RRR డేట్ రావడంతో ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఫాన్స్ తో పాటుగా పాన్ ఇండియా ప్రేక్షకులంతా ఫుల్ ఖుష్ గా ఉన్నారు. కానీ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ మాత్రం కయ్యమంటున్నాడు. కారణం ఆయన నిర్మాతగా తెరకెక్కుతున్న మైదాన్ సినిమాని అక్టోబర్ 15 న విడుదలకు డేట్ లాక్ చేసుకున్నాడు.

అదిగో నేను అక్టోబర్ 15 మైదాన్ అని ఎప్పుడో ఆరు నెలల క్రితమే డేట్ ఇస్తే.. ఇప్పుడు రాజమౌళి RRR డేట్ అక్టోబర్ 13 అంటూ ప్రకటించడం ఏమిటి అంటూ చిందులు తొక్కుతున్నాడు. మరి రాజమౌళి సినిమాలంటే బోని కపూర్ కి ఎంత భయమో అర్ధమవుతుంది. బాహుబలి బాలీవుడ్ బాక్సాఫీసుని షెకాడించడం బోని కపూర్ మర్చిపోయినట్లుగా లేరు. అందుకే RRR రిలీజ్ డేట్ చూసి దడుచుకున్నాడు అంటూ RRR అభిమానులు బోని కపూర్ పై సైటర్లు వేస్తున్నారు. బోని మాత్రం ఇది అన్యాయం అంటూ ఇంటర్వ్యూ లో మాట్లాడుతున్నారు. కరోనా తో పరిశ్రమ చాలా దెబ్బతింది. కానీ ఇలాంటి టైం లో సినిమా పరిశ్రమని అందరూ కలిసి కాపాడుకోవాలి కానీ.. ఇలా చెయ్యడం బాగోలేదంటూ రాజమౌళి ని ప్రశ్నిస్తున్నాడు బోని కపూర్.

Boney Kapoor angry With Rajamouli:

Boney Kapoor upset over Maidaan vs RRR clash

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ