పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలను పక్కనబెట్టేశారు. జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో చైతన్యం తేవడం కోసం కష్ట పడుతున్నారు. పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండి పవన్ వెనుక మెగా ఫ్యామిలీ ఉందొ లేదో తెలియదు కానీ.. నాదెండ్ల మనోహర్ పవన్ వెన్నంటే ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చాక జనసేన బాధ్యతలను భుజాల మీద మోస్తున్న నాదెండ్ల మనోహర్ ఇప్పుడు పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ విషయంపై జనసేన మీటింగ్ లో హాట్ కామెంట్స్ చేసారు. రాజకీయాలు అంటూ రెండేళ్లు సినిమాల విషయంలో దూరంగా ఉండి.. మళ్ళీ గత ఏడాది సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడమే ఐదు సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏకే రీమేక్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
అయితే పవన్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం వెనుక ఆయన అన్న చిరు ఉన్నారని.. పవన్ మళ్ళీ సినిమాలు చెయ్యాలంటూ చిరు చెప్పడంతోనే పవన్ మళ్ళీ సినిమాల్లోకి వచ్చారని నాదెండ్ల పవన్ రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి గారు పవన్ తో మాట్లాడి కొంతకాలం సినిమాలు చెయ్యాలంటూ ఒప్పించారని.. అలాగే పవన్ రాజకీయ ప్రస్థానంలో చిరు తాను తోడుంటాను అని మాటిచ్చినట్లుగా నాదెండ్ల మనోహర్ జనేసేన కార్యకర్తల మీటింగ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.