మేల్ యాంకర్ గా బుల్లితెర ని ఏలుతున్న ప్రదీప్ మాచిరాజు.. వెండితెరకి హీరోగా పరిచయం కాబోతున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా రేపు 29 నే థియేటర్స్ లోకి రాబోతుంది. లాక్ డౌన్ ముందే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని ఇన్ని రోజులు వెయిట్ చేసి ఎంతో కాన్ఫిడెంట్ గా థియేటర్స్ లోనే విడుదల చేస్తూ పబ్లిసిటీ హంగామా ని ఓ రేంజ్ లో మొదలు పెట్టింది టీం. ఇప్పటికే నీలి నీలి ఆకాశం సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చెయ్యగా.. ఇప్పుడు ప్రదీప్ మంచి రాజు కోసం కో లేడి యాంకర్స్ రంగంలోకి దిగడం 30 రోజుల్లో ప్రేమించడం పబ్లిసిటీకి మరింత గ్లామర్ అద్దుకుంది.
హాట్ యాంకర్స్ అనసూయ, శ్రీముఖి, రష్మీ గౌతలు ప్రదీప్ మాచి రాజు కోసం రంగంలోకి దిగి సినిమాని ప్రమోట్ చేస్తే చేసారు. ఈ హాట్ యాంకర్స్ ముగ్గురూ ప్రమోషనల్ సాంగ్ అంటూ మాస్ స్టెప్స్ తో రచ్చ రచ్చ చేసి ప్రదీప్ సినిమాకి పబ్లిసిటీ ని ఓ రేంజ్ లో చేసారు. అనసూయ, శ్రీముఖి, రష్మీ గౌతమ్ లు అదిరిపోయే చీరలు కట్టి చిట్టి మాస్టర్స్ కంపోజ్ చేసిన మాస్ స్టెప్స్ తో అదరగొట్టేసారు. నీలి నీలి ఆకాశం సాంగ్ మెలోడీగా హిట్ అయితే.. ఈ 30- రోజుల పబ్లిసిటీ సాంగ్ మరో రేంజ్ హిట్ అనేలా ఉంది. అనసూయ, శ్రీముఖి, రష్మిక మాస్ స్టెప్స్ రచ్చ వీడియో యూట్యూబ్ లో ట్రేడింగ్ లో ఉంది.