మలయాళంలో హిట్ అయిన అయ్యప్పన్ కోషియమ్ సినిమా రీమేక్ అనగానే తెలుగులో రవితేజ చేస్తాడు. బాలకృష్ణ చెయ్యబోతున్నాడు అంటూ రకరకాల పేర్లు వినిపించినా పవన్ బాగా మనసు పడి అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో జాయిన్ అయ్యారు. పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. మరో హీరోగా రానా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ - రానా కి మధ్యన నువ్వా-నేనా అన్నట్టుగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అయినప్పటికీ అయ్యప్పన్ కోషియమ్ కథలో పవన్ పాత్రే హైలెట్ అవుతుంది. పవన్ పవర్ ఫుల్ నిజాయితీ పోలీస్ ఆఫీసర్.. రానా కూడా ఈగో పర్సన్ గా నిజాయితీ కల పోలీస్ ఆఫీసర్ ని రెచ్చగొట్టే స్టైలిష్ పాత్ర.
అయితే అయ్యప్పన్ పాత్రలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ నార్మల్ లుక్ లోనే కంటిన్యూ అవుతున్నారు. బిజూ మీనన్ లా లుక్ మార్చలేదు. ఇక రానా లుక్ మార్చాల్సిన అవసరం లేదు. అయితే పవన్ అయ్యప్పన్ పాత్రలో ఎప్పుడూ కోపం గానే కనిపిస్తాడు. అది పవన్ కి పక్కాగా సూట్ అవుతుంది. మరో పాత్రధారి రానా పవన్ ఈగో ని రెచ్చగొడుతూ జాబ్ పోయేలా చెయ్యడంతో ఆ ఆఫీసర్ కి ఎలాంటి ప్రాబ్లెమ్ లేకుండానే ఊరి జనం అంతా ఆఫీసర్ పాత్రకి హెల్ప్ చేస్తుంటారు. అయితే అలాంటి కథని త్రివిక్రమ్ పవన్ హీరోయిజానికి అనుగుణం మార్చేశాడు అంటున్నారు. మరి అయ్యప్పన్ ఒరిజినల్ వెర్షన్లో పవన్ పాత్ర పర్ఫెక్ట్. అందులో మార్పులు అంటే.. కామెడీ ని యాడ్ చేశారేమో.. అది వర్కౌట్ అవుతుందా అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఇప్పటికే పవన్ కోసం ప్రేక్షకులు అయ్యప్పన్ కోషియమ్ మలయాళ వెర్షన్ ని అమెజాన్ ప్రైమ్ లో వీక్షించేసారు కూడా. ఇలా క్యూరియాసిటిలో సినిమా ప్రేక్షకులు ఉంటె పవన్ చెయ్యబోయే రీమేక్ ఇప్పుడు తెలుగులో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనే ప్రశ్న మొదలైంది.