పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో ఎంతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఫాన్స్. మొన్నామధ్యన లైగర్ గా విజయ్ దేవరకొండ లుక్ అండ్ టైటిల్ ఎనౌన్స్ చేసినప్పుడే లైగర్ వేట మొదలు కాబోతుంది అనుకున్నారు. కరోనా తో కకావికలం అయినా.. మిగతా సినిమాలన్ని అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ లు కోసం దేశ విదేశాలకు పయనమవుతున్నా పూరి అండ్ విజయ్ లు మాత్రం లైగర్ షూటింగ్ విషయం మాట్లాడుకోవడం లేదు. ఇప్పటికే పూరి అండ్ ఛార్మీలు ముంబై మకాం మార్చేసి అక్కడి ఆఫీస్ ఓపెన్ చేసారు. కానీ విజయ్ దేవరకొండ ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాడు.
నిన్నటివరకు ముంబై లో కరోనా ఎక్కువ ఉన్న కారణంగా హైదరాబాద్ లోనే ముంబై సెట్ వేసి లైగర్ షూటింగ్ మొదలు పెడతారని అన్నారు. కానీ తాజాగా పూరి మాత్రం ఈ కథకి ముంబైగా పరిసర ప్రాంతాలే కనెక్ట్ అవుతాయి కానీ.. సెట్ వేసి దాని అందాన్ని పాడు చెయ్యొద్దు అంటూ ముంబైలోనే లైగర్ వేట ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్లుగా టాక్. అది ఫిబ్రవరి మొదటి వారంలో లైగర్ వేట ముంబైలో మొదలు కాబోతుంది అని సన్నిహిత వర్గాల సమాచారం. ఇక విజయ్ దేవరకొండ కూడా త్వరలోనే ముంబై వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే లైగర్ హీరోయిన్ అనన్య పాండే వేరే ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంది. ఇక విజయ్ - పూరి లైగర్ మొదలవ్వాల్సిందే తరువాయి అంటున్నారు.