ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిమ్స్ దర్శకులు ఎంత ఫాస్ట్ గా ఉన్నారో చూస్తున్నాం. సలార్ ప్రకటనే టైటిల్ పోస్టర్ తో రివీల్ అయితే.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ టైటిల్ తో పాటుగా విలన్ రోల్ ని చెప్పేసారు. ఇక నాగ్ అశ్విన్ ఎప్పుడో హీరోయిన్ దీపికా పదుకొనే, అలాగే అమితాబచ్చన్ కీలక పాత్ర చెయ్యబోతున్నారంటూ రివీల్ చేసి ప్రభాస్ ఫాన్స్ కి ట్రీట్ ల మీద ట్రీట్ లు ఇచ్చేసారు. కానీ రాధేశ్యామ్ టీం మాత్రం ఎప్పటికప్పుడు ఫాన్స్ ని నిరాశపరుస్తూనే ఉంది. ఎప్పుడో మొదలైన రాధేశ్యామ్ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రావడానికే చాలా టైం పట్టింది. అది కూడా ఫాన్స్ తాకిడి తట్టుకోలేక. అసలు రాధేశ్యామ్ అప్ డేట్ విషయంలో ఫాన్స్ ఎప్పటికప్పుడు ఎదురు చూడడం తర్వాత నిరాశ పడడం అనేది అలవాటుగా మారిపోయింది.
ఈ రిపబ్లిక్ డే రోజున రాధేశ్యామ్ అప్ డేట్ ఉంటుంది అని ప్రభాస్ ఫాన్స్ ఆశగా ఎదురు చూసారు. సోషల్ మీడియాలోని రాధేశ్యామ్ అప్ డేట్ ఉంటుంది అని ప్రచారం కూడా జరిగింది. దానితో రాధేశ్యామ్ టీజర్ పక్కా అనుకున్నారు ఫాన్స్. మరోపక్క పాన్ ఇండియా ఫిలిమ్స్ పబ్లిసిటీ జోరు ఓ రేంజ్ లో కనబడుతుంటే రాధేశ్యామ్ టీం మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా కనిపిస్తున్నారు. రాధాకృష్ణ కానీ, యూవీ నిర్మాతలు కానీ రాధేశ్యామ్ విషయంలో ఇలా ఏమి పట్టనట్టుగా ఉంటే.. సినిమాపై క్రేజ్ ఏముంటుంది అంటూ ఫాన్స్ భయపడుతున్నారు.