సినిమా ఇండస్ట్రీకి వేసవి సెలవలు పెద్ద టార్గెట్. అందుకే భారీ బడ్జెట్ సినిమాలన్ని సమ్మర్ ని టార్గెట్ చేస్తుంటాయి. సంక్రాంతి, దసరా రెండు పండగలకు ఎంత రెవిన్యూ వస్తుందో.. సమ్మర్ రిలీజ్ మూవీస్ కి అంత రెవిన్యూ రాబడతారు. ఎందుకంటే ఏప్రిల్ కల్లా స్కూల్స్ హాలిడేస్ మొదలవుతాయి. పది, ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యాక స్టూడెంట్స్ రిలాక్స్ గా కూల్ గా సమ్మర్ రిలీజ్ లని ఎంజాయ్ చేస్తారు. కాబట్టే భారీ మూవీస్ అన్ని సమ్మర్ మీదే కన్నేస్తాయి. కానీ ఎప్పటిలాగా ఈ సమ్మర్ ని నమ్ముకుంటే దెబ్బైపోవడమే.
కారణం కరోనానే. కరోనా వలన సినిమాలు వాయిదాలు పడ్డాయి. పిల్లల స్కూల్స్ మూత బడ్డాయి. లేట్ గా విద్యా సంవత్సరం మొదలు కావడంతో పిల్లల ఎగ్జామ్స్ మొత్తం మే, జూన్ కి షిఫ్ట్ అయ్యాయి. అంటే స్టూడెంట్స్ అంతా మే, జూన్ ఎగ్జామ్స్ ఫీవర్ లో ఉంటారు. అందుకే సమ్మర్ లో రిలీజ్ అంటున్న సినిమాలకు రెవిన్యూ, భారీ కలెక్షన్స్ రావడం కల్లే. ఇప్పటికే రాజమౌళి తెలివిగా ఆర్. ఆర్. ఆర్ ని దసరా టార్గెట్ గా బరిలోకి దించుతున్నారు. కానీ తాజాగా డేట్స్ లాక్ చేసుకుంటున్న లవ్ స్టోరీ, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు వేసవి బరి అంటున్నాయి. అంటే సమ్మర్ రిలీజ్ లకి ఫిక్స్ అవుతున్న దర్శకనిర్మాతలు కొద్దిగా అలోచించి నిర్ణయం తీసుకుంటే బావుంటుంది. లేదంటే ఇప్పుడెలా ఉందో సమ్మర్ కూడా అలానే ఉంటుంది. కానీ స్పెషల్ గా భారీ కలెక్షన్స్ అయితే రావనేది ట్రేడ్ వర్గాల అంచనా.