ఈ రోజు ఉదయం వరకు ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదు.. వాయిదా వేయించాలంటూ కోర్టులు చుట్టూ తిరిగిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు దారికొస్తుంది. ప్రజల ప్రాణాలతో, ఉద్యోగాల ప్రాణాలతో SEC చెలగాటమాడుతుంది.. చంద్రబాబు చెప్పినట్టుగా నిమ్మగడ్డ రమేష్ కుమర్ వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడిన వైసీపీ నేతలకు సుప్రీం కోర్టు ఝలక్ ఇచ్చింది. ఏదో కావాలనే ఎన్నికలను ఏపీ ప్రభుత్వం ఆపుతుంది అంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. జగన్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి ఎదురు తిరిగేలా చేసినా.. SEC తన నిర్ణయాన్ని మార్చుకోకపోయేసరికి ఉద్యో సంఘాల నేతలతో కోర్టులో పిటిషన్ వేయించింది ప్రభుత్వం. ఏది ఎలాగున్నా ఎన్నికలు జరపాలంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
అయితే ఉద్యోగుల ప్రాణాలను, ప్రజల ప్రాణాల కోసం మేము పోరాడాము, కానీ కుదరలేదు.. ఇప్పుడు ప్రజల దృష్టిలో మేము హీరోలమయ్యాము.. ఈ ఎన్నికల్లో మాదే గెలుపు, ఈ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ, చంద్రబాబు మాత్రం విలన్స్ గా మిగిలిపోయారు అంటూ వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మాట్లాడితే.. మేము ఎన్నికలకు వ్యతిరేఖం కాదు.. ఎప్పుడైనా ఎన్నికలకి సిద్దమే.. ఈ ఎన్నికల్లో గెలుపు వైసీపీదే అంటూ వైసిపి ఎమ్యెల్యే పార్ధసారధి మాట్లాడుతున్నారు. మరోపక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి కామ్ గా అడ్వాకెట్ జనరల్, పంచాయితీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డితో సమావేశమయ్యారు. అయితే రేపు ఏపీ సీఎస్ SEC నిమ్మగడ్డని కలిసే అవకాశం ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు మేము సిద్ధంగా లేమంటూ ఉద్యోగ సంఘాల బెదిరింపులకు నిమ్మగడ్డ తనకి కేంద్ర సిబ్బంది కావాలని.. ఎన్నికలు జపారడానికి కేంద్రం సపోర్ట్ కావాలంటూ లేఖ రాయటడం హాట్ టాపిక్ అయ్యింది.