తొమ్మిది నెలల పాటు థియేటర్స్ అన్ని మూగబోయాయి. బాక్సాఫీసు నిద్రపోయింది. కరోనా కరోనా అంటూ హీరోలంతా ఫామిలీస్ తో ఎంజాయ్ చేసారు. ఇక డిసెంబర్ నుండి థియేటర్స్ ఓపెన్ అయ్యి.. ఒక్కొక్కటిగా సినిమాలు విడుదల అవుతున్నాయి. డిసెంబర్ లో సాయి ధరమ్ తేజ్ బోణి కొడితే.. జనవరి సంక్రాంతి పండగకి రవితేజ, రామ్, విజయ్, బెల్లంకొండ పోటీ పడ్డారు. ఇక అప్పటినుండి వారానికో సినిమా చొప్పున విడుదల డేట్స్ లాక్ అవుతున్నాయి. ఫిబ్రవరి, మార్చి అన్ సీజన్ వలన సినిమాల విడుదలకు దర్శకనిర్మాతలు మొగ్గు చూపేవారు కాదు. కానీ ఈ ఫిబ్రవరి, మార్చ్ లో ఎలాంటి ఎగ్జామ్స్ లేవు. టెన్త్, ఇంటర్ పరీక్షలు మే కి షిఫ్ట్ అయ్యాయి. అయినా తొమ్మిదినెలల గ్యాప్ వచ్చేసరికి ఎగ్జామ్స్ ని పట్టించుకునే స్థితిలో ఎవరూ లేరు. అందుకే విడుదల డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఫిబ్రవరిలో రెండు మూడు సినిమాల డేట్స్ రావాల్సి ఉండగా..
మార్చ్ లో సెకండ్ వీక్ అంటే మహాశివరాత్రికి సినిమాలన్ని పొలోమంటూ థియేటర్స్ మీద దండయాత్రకు దిగుతున్నాయి. ముందుగా శర్వానంద్ శ్రీకారం మహాశివరాత్రికి రిలీజ్ అంటూ మార్చ్ 11 కి డేట్ ఫిక్స్ చేసుకుంటే.. నిన్న శ్రీ విష్ణు గాలి సంపత్, అలాగే నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు మహాశివరాత్రి కానుకగా మార్చ్ అంటూ పోటీకి తయారయ్యాయి. మధ్యలో మంచు విష్ణు డేట్ ఎనౌన్స్ చెయ్యకుండా మోసగాళ్లు కూడా మార్చి మహాశివరాత్రి అంటున్నాడు. మరి థియేటర్స్ తెరుచుకున్నాక హీరోలంతా వరసబెట్టి డేట్ ఎనౌన్స్ చేస్తున్నారు. రవితేజ, రామ్, విజయ్ లు 50 శాతం అక్యుపెన్సీతోనే బ్రేక్ ఈవెన్ కొట్టేసారు. మనకి ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదులే అంటూ బరిలోకి దిగుతున్నారు యంగ్ హీరోలు.