Advertisementt

ట్రేండింగ్ లో సర్కారు వారి పాట

Mon 25th Jan 2021 10:34 AM
sarkaru vaari paata,mahesh babu,parasuram,dubai schedule,keerthy suresh,shoot begins  ట్రేండింగ్ లో సర్కారు వారి పాట
Sarkaru Vaari Paata Trending in Social Media ట్రేండింగ్ లో సర్కారు వారి పాట
Advertisement
Ads by CJ

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా విడుదలై ఈ సంక్రాంతికి సరిగ్గా ఏడాదైంది. మళ్ళీ ఏడాదికి మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో సెట్స్ మీదకెళ్ళాడు. పరశురామ్ తో మహేష్ బాబు సర్కారు వారి పాటని అనౌన్స్ చేసి ఏడెనిమిది నెలలు కావొస్తుంది. ఇక పూజ కార్యక్రమాలు అవి ఇవి ఓ రెండు నెలలు అయ్యింది. సర్కారు వారి పాట అమెరికా షెడ్యూల్ కోసం ఈ రెండు నెలలు దోబూచులాడిన టీం ఎట్టకేలకు అమెరికా షెడ్యూల్ ని కాస్తా దుబాయ్ షెడ్యూల్ గా మార్పులు చేసి.. చివరికి సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ కోసం దుబాయ్ ఫ్లైట్ ఎక్కారు.

మహేష్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కి వెళితే.. దర్శకుడు పరశురామ్ టీం ని వేసుకుని దుబాయ్ వెళ్ళాడు. ఇక కీర్తి సురేష్ జాలిగా దుబాయ్ కి బయలు దేరింది. మరి టీం మొత్తం దుబాయ్ వెళ్లి నాలుగురోజులైంది సర్కారు వారి అప్ డేట్ రాలేదేమిటా అని ఎదురు చూస్తున్న మహేష్ అభిమానులు థమన్ మ్యూజిక్ బ్యాగ్రౌండ్ తో కలిసి సర్కారు వారి పాట షూటింగ్ మొదలైంది అంటూ వీడియోతో సహా క్లారిటీ ఇచ్చేసారు. దానితో మహేష్ అభిమానులు సర్కారు వారి పాట యాక్షన్, షూటింగ్ బిగినింగ్ వీడియోని ట్రేండింగ్ లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ట్విట్టర్ లో సర్కారు వారి పాట ట్రెండ్ అవుతుంది. 

Sarkaru Vaari Paata Trending in Social Media:

Sarkaru Vaari Paata: The auction and the action begins