Advertisementt

బన్నీ ఐటెం భామ.. మహేష్ కి కూడానా?

Sun 24th Jan 2021 10:16 PM
urvashi rautela,pushpa movie,sukumar,allu arjun,item song,sarkaru vaari paata,mahesh babu,parasuram,devisri prasad,thaman  బన్నీ ఐటెం భామ.. మహేష్ కి కూడానా?
Bollywood Item For Bunny and Mahesh బన్నీ ఐటెం భామ.. మహేష్ కి కూడానా?
Advertisement
Ads by CJ

సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో దేవిశ్రీ ఇచ్చే ఐటెం నెంబర్ ఏ రేంజ్ లో క్లిక్ అయ్యిందో ఆర్య దగ్గరనుండి చూస్తున్నాం. సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. దేవిశ్రీ కూడా సుకుమార్ సినిమాలకు స్పెషల్ ఐటెం మ్యూజిక్ కొడతాడు. ప్రస్తుతం బన్నీ - సుక్కు కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప సినిమాలో అదిరిపోయే ఐటెం కోసం బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెల్లని దింపిన విషయం తెలిసిందే. బాలీవుడ్ క్రేజీ భామ దిశా పటానికి సంప్రదించిన పుష్ప టీంకి దిశా అడిగిన పారితోషకంతో దిమ్మతిరిగి ఊర్వశి దగ్గర ఆగారు. హాట్ గ్లామర్ గర్ల్ ఊర్వశి బన్నీ తో మాస్ స్టెప్స్ వేసేందుకు ఆసక్తిగా ఉంది.

అయితే ఇప్పుడు అదే ఊర్వశి రౌతేల్ల పరశురామ్ - మహేష్ సర్కారు వారి పాటల్లోనూ ఐటెం సాంగ్ కి చిందులు వెయ్యబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. థమన్ అందించబోతున్న సర్కారు వారి పాట కోసం ఓ ఐటెం సాంగ్ డిజైన్ చేసారని.. అయితే ఆ సాంగ్ లో మహేష్ తో కలిసి ఊర్వశి రౌతెల్లానే డాన్స్ చెయ్యబోతుందనే న్యూస్ వినిపిస్తుంది. ఇప్పటికే పరశురామ్ అండ్ టీం దుబాయ్ వెళ్లిపోయారు. మహేష్ అటు సర్కారు వారి పాట షూటింగ్, ఇటు భార్య పుట్టిన రోజు వేడుకల కోసం దుబాయ్ వెళ్ళిపోయాడు. రీసెంట్ గా సర్కారు వారి హీరోయిన్ కీర్తి సురేష్ కూడా దుబాయ్ ఫ్లైట్ ఎక్కిన ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం దుబాయ్ లోనే సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది.

Bollywood Item For Bunny and Mahesh:

Urvashi Rautela Item Song In Pushpa, Sarkaru Vaari Paata

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ