ఈ ఏడాది థియేటర్స్ లో తోలి శుభారంభాన్ని ఇచ్చిన రవితేజ క్రాక్ సినిమా థియేటర్స్ లో దూకుడు ఇంకా తగ్గలేదు. మూడో వారంలోను క్రాక్ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సంక్రాంతి సినిమాలు డల్ అవడంతో రవితేజ క్రాక్ సినిమా కలెక్షన్స్ బాగా పెరిగాయి. మాస్టర్ కి ప్లాప్ టాక్ పడినా విజయ్ క్రేజ్ తో మాస్టర్ బ్రేక్ ఈవెన్ సాధించేయ్యగా.. రామ్ రెడ్ సినిమాకి మిక్స్డ్ టాక్ పడినా వారానికి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఏది ఎలా ఉన్న క్రాక్ జోరు మాత్రం తగ్గలేదు. దానితో రెండో వారంలో క్రాక్ కి థియేటర్స్ పెంచారు. దెబ్బకి క్రాక్ కి లాభాలే లాభాలు. మూడో వారంలోను క్రాక్ కి పోటీ వచ్చే సినిమా లేదు. అల్లరి నరేష్ నటించిన బంగారు బుల్లోడు సినిమాకి డిజాస్టర్ టాక్ పడడంతో.. క్రాక్ కలెక్షన్స్ పుంజుకున్నాయి. మరి ఇంకా థియేటర్స్ లో దున్నేస్తున్న సినిమా అప్పుడే ఓటిటి నుండి విడుదల కావడం నిజంగా షాకింగ్ విషయమే.
కలెక్షన్స్ జోరులో ఉన్న క్రాక్ జనవరి 29 న అంటే క్రాక్ విడుదలైన మూడు వారాలకే ఓటిటి నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంతకుముందు సినిమా విడుదలైన రెండు నెలలకి కానీ ఓటిటి కి రాని సినిమాలు ఇప్పుడుకరోనా కారణముగా ఇలా మారిపోయాయి. థియేటర్స్ లో మంచి లాభాలు కొల్లగొడుతున్న క్రాక్ సినిమాని జనవరి 29 న ఆహా ఓటిటి నుండి రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయం రవితేజకి షాకింగ్ విషయమనే చెప్పాలి. ఎలాగూ థియేటర్స్ లో విడుదలై లాభాలొచ్చాయి. ఇక ఓటిట్ ఆఫర్ వదులుకోవడమెందుకు అని.. క్రాక్ నిర్మాతలు ఇలా ఆహా కి అమ్మెసినట్టున్నారు.