Advertisementt

పవన్ భార్యగా కీర్తి సురేష్

Sun 24th Jan 2021 01:12 PM
keerthy suresh,pawan kalyan,sekhar k chandra,ak remake producers,pawan wife,rana,pawan kalyan in ak remake  పవన్ భార్యగా కీర్తి సురేష్
Keerthy suresh romance with Pawan kalyan పవన్ భార్యగా కీర్తి సురేష్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ తిరుపతి ప్రకటన ముగించుకుని ఏకే రీమేక్ కోసం పోలాచ్చి వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమాని కొద్దిరోజులపాటు పక్కనబెట్టి అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తిరుపతి నుండి హైదరాబాద్ కి వచ్చి పవన్ కళ్యాణ్ పొలాలిచ్చి వెళ్ళబోతున్నారు. 45 రోజులపాటు ఏకే రీమేక్ షూటింగ్ లో పవన్ పాల్గొనబోతున్నారు. అయితే ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ పాత్రలో రానా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్ర కోసం నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని సంప్రదించడం, ఆమె ఓకె చెప్పడం జరిగింది అనే టాక్ కూడా నడిచింది. దాదాపుగా పవన్ భార్య పాత్రకి సాయి పల్లవే ఫిక్స్ అన్నారు.

కానీ పవన్ కళ్యాణ్ భార్య పాత్ర కోసం కీర్తి సురేష్ తో సంప్రదింపులు జరుగుతూన్నాయనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. ప్రస్తుతం సర్కారు వారి పాట కోసం దుబాయ్ వెళ్లిన కీర్తి సురేష్ తో ఏకే రీమేక్ దర్శకుడు శేఖర్ కె చంద్ర తో పాటుగా నిర్మాతలు కలిసి కీర్తి ని ఏకే రీమేక్ లో పవన్ కళ్యాణ్ వైఫ్ పాత్రలో నటించేందుకు సంప్రదింపులు స్టార్ట్ చేశారట. కేవలం 12 రోజుల డేట్స్ అయితే సరిపోతుంది అని, దానికి కోసం కీర్తి సురేష్ కి ఏకే నిర్మాతలు 60 లక్షలు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక 12 రోజుల డేట్స్ కాబట్టి కీర్తి సురేష్ కూడా పవన్ భార్యగా ఏకే రీమేక్ లో నటించేందుకు సుముఖత చూపుతుంది అనే నమ్మకంతో ఏకే నిర్మాతలు ఉన్నారట.

Keerthy suresh romance with Pawan kalyan:

Keerthy suresh romance with Pawan kalyan in AK remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ