టిడిపి నుండి వైసిపిలోకి జంప్ అయ్యాక రోజా జగన్ కి కొమ్ముకాసింది. జగన్ పేరెత్తితే ఎదురు వాడికి ఒణుకు పుట్టించే మాదిరి అంతలా మాటల తూటాలతో విరుచుకుపడేది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ ల రోజా వైసిపి పార్టీకి వెన్ను దన్నుగా నిలిచింది. వైసిపిలో కొడాలి నాని, రోజా అంటే ప్రతి పక్షానికి హడల్ అనేలా ఉండేవారు. ఇక వైసిపి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టాక రోజాకి మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్నారు. రోజా కూడా అదే ఊహించింది. కానీ రోజా ఊహలను జగనన్న తల్లకిందులు చేసాడు. రోజాకి ఎలాంటి మంత్రి పదవి ఇవ్వలేదు. APIIC అనే పదవిని కట్టబెట్టినా రోజా మౌనం వహించింది. ఇక జగనన్న జగనన్నా అంటూ జగన్ దగ్గర ఆశీర్వాదాలు తీసుకునే రోజా ఈమధ్యన బాగా సైలెంట్ అయ్యింది.
నగరి నియోజక వర్గంలో వీధి వీది తిరుగుతూ అందరి సమస్యలను తెలుసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రోజా ఈమధ్యన కన్నీటి పర్యంతమైంది. తన నియోజక వర్గ అధికారులు తన మాట వినడం లేదని.. తనకి అధికార పార్టీ ఎమ్యెల్యే అడ్డం పడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మరో పక్క మంత్రి పెద్ది రెడ్డి వర్గీయుల నుండి రోజాకి ఎలాంటి సహాయ సహకారాలు అందకుపోగా.. రోజా కేడర్ కి పెద్ది రెడ్డి కేడర్ కి మధ్యన అంతర్గత విభేదాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ప్రభుత్వానికి ఎదురు నిలబడి SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.
మరి రోజా యాక్టీవ్ గా ఉంటే ఈ పాటికి నిమ్మగడ్డ మీద విరుచుకుపడేదే. నిమ్మగడ్డ టిడిపి అధికార ప్రతినిధి అంటూ రెచ్చిపోయి మాట్లాడేది. కానీ ఈ ఎన్నికల మేటర్ కదిపిన మీడియా మిత్రులకి రోజా నుండి నో కామెంట్స్ అనే సమాధానం రావడం ఇప్పుడు అందరికి షాకిచ్చింది. మరి రోజా విషయంలో ఇంత జరుగుతున్నా రోజా అన్నకాని అన్న జగనన్న మౌనం వహించడం చూసిన వారు జగన్ అసలు రోజాను పట్టించుకోవడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.