కరోనా రాకపోతే ఇప్పటికే ఎప్పుడో రిలీజ్ అయిపోయి.. మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ తేజ్ భవితవ్యం ఏమిటో తెల్చేయ్యల్సిన ఉప్పెన సినిమా ఇప్పటికి రిలీజ్ కాకుండా ఆగుతూనే వస్తుంది. మిడిల్ లో ఓటిటి, ఏటిటి అన్నాకూడా దేనికి తల వొంచని నిర్మాతలు థియేటర్స్ లోనే ఉప్పెన సినిమాని విడుదల చెయ్యాలని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు థియేటర్స్ అన్ని ఓపెన్ అయ్యి, అంతా బాగానే ఉన్నా కూడా ఇంకా పర్ఫెక్ట్ ప్లాట్ ఫామ్ కోసం ఉప్పెన రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఉప్పెన డేట్ ని బట్టి మరి కొన్ని సినిమాలు డేట్స్ కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికీ ఉప్పెన సినిమాకి రిలీజ్ డేట్ ఇవ్వకుండా నాన్చుతూనే ఉన్నారు మేకర్స్.
ఓపెన్ గ్రౌండ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ కి సినిమా మీద నమ్మకం ఉంటే కాన్ఫిడెంట్ గా రిలీజ్ చేసుకోవచ్చు. ఓపెన్ గ్రౌండ్ కోసం ఎందుకు చూడరు.. లేదూ పై నుండి మెగా ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా.. అనేది డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఒక సినిమా కంప్లీట్ చేసుకుని రెండో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసేసిన మెగా హీరో వైష్ణవ తేజ్ మొదటి సినిమా విడుదలకు ఇంకా నోచుకోవడం లేదు. ఉప్పెన మేకర్స్ మదిలో ఏముందో కానీ.. సినిమా విడుదల విషయంలో ఇంకెంత కాలం ఈ తర్జన భర్జన అంటున్నారు నెటిజెన్స్.