మెగాస్టార్ చిరంజీవి మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన హీరో. రెండు జెనరేషన్స్ ని చక్కగా ఎన్నటెరైన్ చేసి మెగాస్టార్ అనిపించుకున్న చిరు ఈ జెనరేషన్స్ ని శాటిస్ఫాయ్ చెయ్యడంలో మాత్రం తడబడుతున్నారు. కత్తి రీమేక్ పట్టుకొచ్చి ఖైదీ నెంబర్ 150 సినిమాని చేసినా కూడా..ఏదో సంక్రాతి సీజన్ అడ్వాంటేజ్, ఆ సినిమాలోని సదరు కమర్షియల్ వాల్యూస్.. మెగాస్టార్ ని తొమ్మిదేళ్ల తర్వాత స్క్రీన్ మీద చూస్తున్నామనే క్యూరియాసిటీ, ఫీలింగ్ తో బయటపడిపోయారే తప్ప.. ఇంకా చిరంజీవి ఈ జెనరేషన్ కి సరిగ్గా కనెక్ట్ అవడం లేదనే విషయం సై రా సినిమా రిజల్ట్ తోనే అర్ధమైపోయింది.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఆచార్య సినిమా ఎంత చేస్తున్నా ఇప్పటికి సరైన బజ్ క్రియేట్ అవడం లేదు. ఆర్ ఆర్ ఆర్ కి, రాధేశ్యామ్ కి ఉన్నంత బజ్ ఆచార్య సినిమాకి లేదనేది ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అందుకే క్రేజీ హీరో రామ్ చరణ్ ని ఆచార్య సినిమాలో యాడ్ చేసారు.ఇక రీసెంట్ గా మొదలైన లూసిఫెర్ రీమేక్ లో కూడా చిరు కి గ్లామర్ ఉండదు, హీరోయిన్ ఉండదు, డ్యూయెట్స్ ఉండవు. ఏరి కోరి ఆ రీమేక్ ని ఎందుకు ఎంచుకున్నారో చిరుకే తెలియాలి. ఇక ఆ సినిమా ఓపెనింగ్ లో చూస్తే అందరూ 50+ పీపుల్ మాత్రమే కనిపించారు. థమన్ తప్ప. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తప్ప 50 ఏళ్ళ వయసు పైబడినవారే ఆ ఓపెనింగ్ లో కనిపించేసరికి.. ఈ సినిమాని వృద్దులు, పెద్దలు కలిసి చేస్తున్నారు మనకి సంబంధం లేదు అన్నట్టు ఉన్నారు యూత్. మరి చిరు ఇలాంటి సబ్జక్ట్స్ కి ఎందుకు మొగ్గు చూపుతున్నారో అంటూ మెగా ఫాన్స్ లోను ఆ టెంక్షన్ ఉంది.