ప్రభాస్ ఎప్పుడూ స్లోగా రెండేళ్ళకి పైగా ఒక సినిమా చేస్తూ ఫాన్స్ కి అగ్ని పరీక్షా పెట్టేవాడు. బాహుబలి దగ్గరనుండి ప్రభాస్ చాలా స్లోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ వరస సినిమాల కమిట్మెంట్స్ చూస్తే ఏ 2025 కో పూర్తవుతాయని ఫిక్స్ అవుతారు. కానీ ప్రభాస్ మాత్రం అలాంటిదేం లేదు.. 2022 కల్లా నాలుగు సినిమాలు ప్రేక్షకులకు అందిస్తానంటూ వరస సర్ప్రైజ్ లు ప్లాన్ చేసి ఫాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది.. రిలీజ్ కి కాస్త టైం అపడుతుంది అనగానే కన్నడ డైరెక్టర్ తో సలార్ షూటింగ్ కి సిద్దమవుతూ.. సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలని ఓ రేంజ్ లో మొదలు పెట్టాడు ప్రభాస్. అది అలా అయ్యిందో లేదో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ లైన్ లోకొచ్చేసి ఆదిపురుష్ అప్ డేట్ ఇచ్చేసి అందరికి షాక్ ఇచ్చేసాడు. ఫిబ్రవరి నుండి ఆదిపురుష్ పట్టాలెక్కబోతుంది అని.
ఇక నాగ్ అశ్విన్ అయితే సంక్రాంతికి అప్ డేట్ ఇస్తా అంటూ ఊరించాడు. కానీ నాగ్ అశ్విన్ అప్ డేట్ ఆలస్యమవడంతో ప్రభాస్ ఫాన్స్ నాగ్ అశ్విన్ కి ట్వీట్స్ వెయ్యడం మొదలు పెట్టారు. మాకు అప్ డేట్ కావాలి అంటూ.. దానితోనాగ్ అశ్విన్ కూడా హడావిడిగా లైన్ లోకొచ్చాడు. ఇంతకుముందే హీరోయిన్ గా దీపికా పదుకొనే, అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ప్రభాస్ సినిమాలో నటించబోతున్నారంటూ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్ ఇప్పుడు మరో శుభవార్త చెప్పాడు. జనవరి 29 కానీ, ఫిబ్రవరి 26 కానీ ప్రభాస్ కొత్త సినిమా అప్ డేట్ ఉండబోతుంది అంటూ డేట్స్ తో సహా ఇచ్చేసరికి ప్రభాస్ ఫాన్స్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. ప్రభాస్ వరస సర్ప్రైజ్ లు చూసిన వారు అబ్బ ప్రభాస్ అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదుగా అంటున్నారు.