Advertisementt

చరణ్ జోడిగా జిగేలు రాణి

Fri 22nd Jan 2021 04:10 PM
pooja hegde,ram charan,chiru,koratala,ram charan -chiru combo,acharya movie  చరణ్ జోడిగా జిగేలు రాణి
Pooja hegde to romance Ram Charan చరణ్ జోడిగా జిగేలు రాణి
Advertisement
Ads by CJ

చిరు - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సంక్రాంతి పండగ ముగియగానే రామ్ చరణ్ సిద్దా గా ఆచర్యలోకి అడుగుపెట్టాడు. రామ్ చరణ్ సిద్దా లుక్ చూస్తే ఈ సినిమాలో చరణ్ పవర్ ఫుల్ రోల్ ప్లే చేయబోతున్నాడని అర్ధమవుతుంది. చిరు సినిమాలో రామ్ చరణ్ నటించడమనేది చిరు భార్య సురేఖ కల. అందుకే కొరటాల రామ్ చరణ్ పాత్రని ఏదో ఇరికించినట్టుగా కాకుండా.. స్పెషల్ గా డిజైన్ చేసాడు. అందుకే ఆ పాత్రకి మరింత గ్లామర్ అద్దడం కోసం ఓ గ్లామర్ హీరోయిన్, ఒక సాంగ్ కూడా రాసుకున్నాడు. అయితే రామ్ చరణ్ కి జోడిగా ఆచార్య లో నటించబోయే హీరోయిన్ విషయంలో చాంతాడంత లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

చివరికి వినయ విధేరామ భామ కియారా అద్వానీని రామ్ చరణ్ కి జోడిగా ఫిక్స్ అనే అన్నారు. కొరటాల బృందం కియారా అద్వానీని సంప్రదించగా ఆమె కూడా ఆచార్య సినిమాలో నటించేందుకు సుముఖంగానే ఉన్నప్పటికీ డేట్స్ ప్రాబ్లెమ్ రావడంతో చివరికి చరణ్ కి జిగేల్ రాణి అదేనండి రంగస్థలంలో రామ్ చరణ్ తో జిగేలు రాణి అంటూ ఐటెం సాంగ్ లో అదరగొట్టిన పూజా హేగ్డ్ ని కొరటాల ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. ఒక్క ఐటెం తోనే చరణ్ - పూజ జోడికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఆచార్యలో చరణ్ కి జోడిగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజ హెగ్డే నటిస్తే సినిమాపై క్రేజ్ మరింతగా పెరుగుతుంది. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ముగించుకుని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటుగా, బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్న పూజ చరణ్ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేసుకుందట. సో ఫైనల్ గా ఆచార్యలో చరణ్ కి జోడిగా పూజ ఫిక్స్ అన్నమాట.

Pooja hegde to romance Ram Charan:

Pooja hegde to romance Ram Charan in Acharya Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ