Advertisementt

రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ దర్శకుడు

Fri 22nd Jan 2021 11:50 AM
kannada director,prashanth neel,prabhas,salaar,prabhas salaar story,ugram kannada movie  రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ దర్శకుడు
Prashanth Neel clarity on Salaar story రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ దర్శకుడు
Advertisement
Ads by CJ

ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ ముగించుకుని కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. సంక్రాంతికి పూజా కార్యక్రమాలతో మొదలైన సలార్ రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతుంది. కెజిఎఫ్ తో సంచలనాలకు తెరలేపిన ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ప్రభాస్ జత కట్టడంతో సలార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబోలో సలార్ మూవీ అనగానే సలార్.. ప్రశాంత్ నీల్ గత చిత్రం ఉగ్రం కి రీమేక్ అంటూ ఓ వార్త ప్రచారం లోకొచ్చింది. అందులోను ప్రభాస్ మాస్ సలార్ లుక్ చూసిన వారు ఇది ఉగ్రం రీమేక్ అంటూ ఫిక్స్ అయ్యారు.

ఎప్పటినుండో ఉగ్రం రీమేక్ సలార్ అంటూ ప్రచారం జరుగుతున్నా పట్టించుకొని ప్రశాంత్ నీల్ తాజాగా ఆ వార్తపై స్పందించాడు. సలార్ ఉగ్రం మూవీ కి రీమేక్ కాదని, సలార్ ఫ్రెష్ మాస్ మసాలా స్టోరీతోనే ప్రభాస్ తో సినిమా తీస్తున్నాను.. సలార్ లో హీరో అమాయకంగా ఉంటూనే డాన్ లా ఎలా మారాడో చూపించబోతున్నట్టుగా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేసాడు. సలార్ దేనికి రీమేక్ కాదని.. ప్రభాస్ తో ఓ మంచి యాక్షన్ మూవీ తియ్యబోతున్నట్టుగా చెప్పాడు. ఈ కథ ప్రభాస్ కి బాగా నచ్చింది అంటూ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసాడు ప్రశాంత్ నీల్.

Prashanth Neel clarity on Salaar story:

Kannada Director Prashanth Neel clarity on Prabhas Salaar story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ