Advertisementt

పడి లేచినవాడితో పందెం.. చాలా ప్రమాదకరం

Tue 02nd Feb 2021 12:47 PM
naga shaurya,birthday special,lakshya teaser,varudu kavalenu teaser,lakshya teaser review  పడి లేచినవాడితో పందెం.. చాలా ప్రమాదకరం
Bet with the one who fell and got up it's very dangerous పడి లేచినవాడితో పందెం.. చాలా ప్రమాదకరం
Advertisement
Ads by CJ

నాగ శౌర్య నటించిన అశ్వద్ధామ సినిమా సోసో హిట్ అయినా.. ప్రస్తుత్యం నాగ శౌర్య జోరు మాములుగా లేదు. యంగ్ హీరోగా నాగ శౌర్య వరసగా మూడు సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. కరోనా క్రైసిస్ తర్వాత మూడు సినిమాల సెట్స్ లో నాగ శౌర్య దూకుడుగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అందులో లక్ష్య సినిమా కోసం నాగ శౌర్య సిక్స్ ప్యాక్ లుక్ లో అదరగొట్టేసాడు. నేడు నాగ శౌర్య పుట్టిన రోజు సందర్భంగా నాగ శౌర్య నటిస్తున్న వరుడు కావలెను, లక్ష్య సినిమాల నుండి టీజర్స్ వదిలారు ఆయా మూవీ యూనిట్ సభ్యులు. వరుడు కావలెను సినిమాలో కూల్ గా స్టైలిష్ గా కనబడిన నాగ శౌర్య లక్ష్య టీజర్ లో మాత్రం యాంగ్రీ మ్యాన్ గా కసిగా, దూకుడుగా కనిపిస్తున్నాడు. 

లక్ష్య సినిమాలో నాగ శౌర్య వేటగాడు కాదు కాదు.. ఆటగాడిలా  కనిపిస్తున్నాడు. జగపతి వాయిస్ ఓవర్ తోనే లక్ష్య టీజర్ మొత్తం నడిచింది. చాలామందికి ఆటతో గుర్తింపు వస్తుంది.. అంటూ జగపతి బాబు వాయిస్ ఓవర్ తో కురుక్షేత్ర ఆర్చరీ అకాడమిని చూపిస్తూ.. కానీ ఎవడో ఒకడు పుడతాడు. ఆటకి గుర్తింపు తెచ్చేవాడు. పార్ధు కాపిటిషన్ లో లేదు. పార్ధు తన గురి కోల్పోయాడు. అతనిక లైఫ్ లో బో అండ్ ఆరౌ టచ్ చెయ్యలేడు. అంటుంటే..  పడి లేచినవాడితో పందెం.. చాలా ప్రమాదకరం అంటూ జగపతి బాబు చెప్పే వాయిస్ ఓవర్ చూస్తుంటే నాగ శౌర్య పందెం కోసం ఏమైనా చేసేలా కసిగా కనిపిస్తున్నాడు. లక్ష్యలో  నాగ శౌర్య సిక్స్ ప్యాక్ అండ్ కొత్త గెడ్డం లుక్స్ అదరగొట్టేస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో యాక్షన్ కూడా హైలెట్ అనేలా ఉంది. లాస్ట్ లో జగపతి బాబు యహ అంటూ విదిలించడంతో టీజర్ కి ఎండ్ కార్డు వేశారు.

లక్ష్యగా నాగ శౌర్య, కేతిక శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో ఈ సినిమాని సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. నాగ శౌర్య పుట్టిన రోజు స్పెషల్ గా లక్ష్య టీజర్ శౌర్య అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

Bet with the one who fell and got up it's very dangerous:

Naga Shaurya Lakshya Teaser Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ