ప్రభాస్ పాన్ ఇండియా ఫిలిమ్స్ తో యమా బిజీ. పెళ్లి ఊసెత్తకుండా సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటూ పోతున్నాడు. ప్రభాస్ బాహుబలి దగ్గరనుండి పాన్ ఇండియా స్టార్ గా, క్రేజీ హీరోగా ఎదిగాడు. అందుకే అన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటున్నాడు. సాహో ప్లాప్ దెబ్బకి ప్రభాస్ తగ్గుతాడు అనుకున్నవారికి రాధేశ్యామ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో పాటుగా ఓం రౌత్, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ తో అన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే సలార్ ఓపెనింగ్ చేసుకోగా.. ఆదిపురుష్ ఫిబ్రవరిలో మొదలు కాబోతుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ - పూజ హెగ్డే కాంబోలో షూటింగ్ చివరి దశలో ఉన్న రాధేశ్యామ్ విడుదల డేట్ పై చిత్రం బృందం ఓ కొలిక్కి వచ్చినట్టుగా టాక్.
అది కూడా బ్లాక్ బస్టర్ డేట్ ని సెట్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్త. బాహుబలి తో పాన్ ఇండియా మార్కెట్ ని సెట్ చేసుకున్న ప్రభాస్.. బాహుబలి 2 విడుదలైన ఏప్రిల్ 28 నే రాధేశ్యామ్ విడుదల చెయ్యాలనే ప్లాన్ లో రాధేశ్యామ్ మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ తేదినే దాదాపు ఖరారు చేసే అవకాశలున్నాయి అంటున్నారు. అదే రోజున బాహుబలి విడుదలై ప్రపంచ వ్యాపటంగా ప్రభంజనం సృష్టించింది. ఇప్పడు రాధేశ్యామ్ కూడా అదే డేట్ కి విడుదలై బ్లాక్ బస్టర్ అవ్వాలని మేకర్స్ ప్లాన్. అయితే రాధేశ్యామ్ డేట్ లాక్ చేసి అధికారికంగా రిపబ్లిక్ డే రోజున అంటే జనవరి 26 న రాధేశ్యామ్ టీజర్ తో పాటుగా ప్రకటించబోతున్నారని సమాచారం..