సంక్రాంతి సినిమాల వరకు ఎవరికి వారు థియేటర్స్ పంచుకున్నారు. వాళ్ళ వాళ్ళ స్థాయి మేరకు థియేటర్స్ దక్కించుకున్నారు. క్రాక్, మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేసాయి. రావాల్సిన రెవెన్యూని రాబట్టుకున్నారు. ఇక సంక్రాంతి సీజన్ ముగిసింది. ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలన్ని థియేటర్స్ తలుపు తట్టేందుకు సిద్ధమవుతున్నాయి. సరైన డేట్ కోసం తంటాలు పడుతున్నాయి. అందులో ముందుగా జనవరి 23 న అల్లరి నరేష్ బంగారు బుల్లోడు సినిమా విడుదల కాబోతుంది. అలాగే ఇదే నెల 29 న ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా రిలీజ్ డేట్ లాక్ చేసారు మేకర్స్.
ఫిబ్రవరి 5 న జాంబీ రెడ్డి.. ఇలా ఈ మూడు డేట్స్ ని లాక్ చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి ఈ మూడు సినిమాలు. ఇక ఫిబ్రవరి 12 డేట్ కోసం మాత్రం చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కాబట్టి.. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరో గా లాంచ్ అవుతున్న ఉప్పెన సినిమా రిలీజ్ చేస్తారు అని వినిపిస్తుంది. మరోపక్క ఉప్పెన మళ్ళీ డ్రాప్ అవ్వొచ్చని కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా ఆది సాయి కుమార్ శశి, సందీప్ కిషన్ A1 ఎక్స్ప్రెస్ ఆ రెండు సినిమాలు ఫిబ్రవరి 12 రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఉప్పెన గనక ఫిబ్రవరి 12 రేస్ లోకి వస్తే.. ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది. లేదంటే ఈ రెండు సినిమాలు ఆ డేట్ కి పోటీ పడతాయి. ఇక ఫిబ్రవరి 19 న రష్మిక డబ్బింగ్ మూవీ పొగరు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
ఇక నుండి ప్రతి వారం ప్రతి సినిమాకి ఒక్కో డేట్ వెతుక్కునే పరిస్థితే. ఏ వీక్ ఏ థియేటర్స్ ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. ప్రతి సినిమాకి ఓ డేట్ కావాల్సిందే.