Advertisementt

రామ్ చరణ్ సేమ్ మ్యాజిక్.!

Wed 20th Jan 2021 09:09 PM
ram charan,acharya movie,koratala shiva,chiranjeevi,kajal,charan,kiara advani,kiara advani acharya movie  రామ్ చరణ్ సేమ్ మ్యాజిక్.!
Ram Charan Same Magic.! రామ్ చరణ్ సేమ్ మ్యాజిక్.!
Advertisement
Ads by CJ

RRR షూటింగ్ కి చిన్నపాటి బ్రేక్ ఇచ్చి రామ్ చరణ్ కొరటాల శివ - చిరు కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సెట్స్ లోకి సిద్దా గా అడుగుపెట్టాడు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చరణ్ సిద్దా పాత్రకి ఓ గ్లామర్ హీరోయిన్, అలాగే డ్యూయెట్ కూడా ఉండబోతున్నాయనే విషయం రివీల్ కాగానే రామ్ చరణ్ సరసన చాలామంది హీరోయిన్స్ పేర్లు విపించాయి. అందులో ముఖ్యంగా సమంత, రష్మిక, పూజ హెగ్డే పేర్లతో పాటుగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే పేరు గట్టిగానే వినబడింది. దాదాపు అనన్య పాండే ఆచార్య లో చరణ్ కి జోడిగా కన్ఫర్మ్ అన్నారు కూడా. కానీ రీసెంట్ గా మరో బాలీవుడ్ భామ కియారా అద్వానీతో కొరటాల శివ సంప్రదింపులు జరిపి రామ్ చరణ్ కో జోడిగా కియారా అద్వానీని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి రామ్ చరణ్ ఫస్ట్ టైం రకుల్ ప్రీత్ సింగ్ తో జోడి కట్టిన సినిమా బ్రుస్ లీ డిజాస్టర్ అయ్యింది. అయినా ఎలాంటి సెంటిమెంట్ పట్టించుకోకుండా మళ్ళీ ధ్రువ సినిమాలో రకుల్ ప్రీత్ ని రిపీట్ చేసాడు. అదిరిపోయే హిట్ కొట్టాడు. ధ్రువ సినిమాలో రకుల్ చరణ్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు అదే వినయ విధేయరామలో గ్లామర్ గర్ల్ కియారా అద్వానీతో జోడి కట్టాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. కానీ ఇప్పడూ కూడా ఎలాంటి సెంటిమెంట్ పెట్టుకోకుండా రామ్ చరణ్ మరోసారి ఆచార్య లో కియారా అద్వానీతో జోడి కడుతున్నాడు. ఈసారి కూడా చరణ్ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా? మళ్ళీ ఆచార్యతో హిట్ కొడతాడా..?

Ram Charan Same Magic.!:

Ram charan romance to kiara Advani in Acharya movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ