అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి మూడు నెలలు కావొస్తుంది. అక్కడ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి టైం దగ్గర పడింది. కానీ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం నాటకాలు ఆడుతూనే ఉన్నాడు. ట్రంప్ అన్నిటికి ఎదురు వెళ్లే మనిషి. ఎవరి మాట వినని ట్రంప్ వైట్ హౌస్ ఖాళీ చేసేందుకు నిన్నటివరకు ససేమిరా అన్నాడు. ట్రంప్ వైట్ హౌస్ ని ఖాళీ చేసే విషయం చాలా నాటకీయంగా మారింది. అయితే జో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి టైం దగ్గర పడుతున్న వేళ ట్రంప్ తన పట్టుదలను వదిలి భార్య మొనాలియా తో సహా వైట్ హౌస్ ని వదిలి ఫ్లోరిడాలోని తన నివాసానికి పయనమయ్యాడు. జో బైడాన్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ హాజరు కాకుండానే ఆయన వైట్ హౌస్ ని వీడాడు.
కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి మాజీ అధ్యక్షుడు హాజరవ్వాల్సి ఉన్నా.. ఆ పద్దతికి ట్రంప్ కనీస మర్యాద ఇవ్వకుండా కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి హాజరు కాకుండానే ట్రంప్ వైట్ హౌస్ ని వదిలి వెళ్ళిపోయాడు. ఇక అమెరికా ప్రధమ మహిళకు స్వాగతం పలకాల్సిన మాజీ ప్రధమ మహిళా డోనాల్డ్ ట్రంప్ భార్య మొనాలియా కూడా ట్రంప్ తో పాటుగానే వైట్ హౌస్ ని వీడారు. ప్రధమ మహిళకు వైట్ హౌస్ మొత్తం చూపించాల్సిన బాధ్యత మాజీ ప్రధమ మహిళకు ఉన్నప్పటికీ.. ట్రంప్ భార్య మొనాలియా దానికి అంగీకరించకుండా వెళ్ళిపోయింది. ఇక ఈ రోజు రాత్రి 10.30 నిమిషాలకు జో బైడాన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు. అమెరికాకు మంచి రోజులు వస్తాయనే నమ్మకంతోనే తాను వైట్ హౌస్ ని వీడి వెళుతున్నట్టుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యింది.