బాలయ్య క్రాక్ కి కరెక్ట్ డైరెక్టర్

బాలకృష్ణ కి మాస్ కథ, మాస్ డైరెక్టర్ తగిలితే ఎలా ఉంటుందో సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు దగ్గర నుండి నిన్నమొన్నటి సింహ, లెజెండ్ సినిమాల వరకు చూస్తూనే ఉన్నాం. గత కొన్నాళ్లుగా ప్లాప్స్ తో కొట్టు మిట్టాడుతున్న బాలయ్య బాబు మళ్ళీ తనకి మాస్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను తో BB3 చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే బాలయ్య - బోయపాటి BB3 తర్వాత బాలయ్య చెయ్యబోయే నెక్స్ట్ మూవీపై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. గతంలో బాలయ్యకి హిట్స్ ఇచ్చిన బి గోపాల్ కథ సెట్ అయ్యి బాలయ్య బాబు ఒప్పుకుంటే బాలయ్యతో సినిమా చేస్తా, కానీ ఇంతవరకులు కథా చర్చలేమీ బాలయ్య బాబుతో జరగలేదని క్లారిటీ ఇచ్చాడు.

అయితే ఇప్పుడు BB3 తర్వాత బాలయ్య తో నెక్స్ట్ మూవీ చేసేందుకు క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని వచ్చి చేరాడు. ఈ సంక్రాంతికి ముందుగా బరిలోకి దిగిన గోపీచంద్ మలినేని క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. క్రాక్ ఇచ్చిన హిట్ ఉత్సాహంలో గోపీచంద్ మలినేని - బాలయ్య మూవీ ని సెట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ మాస్ ఎంటర్టైనర్ ఫిక్స్ అయ్యింది. మరి క్రాక్ డైరెక్టర్ కి మాస్ హీరో బాలయ్య దొరికితే ఆ సినిమా మాస్ మసాలాలా ఉండడం ఖాయం. ఇక ఎప్పటినుండో బాలయ్య బాబు తో మైత్రి మూవీ మేకర్స్ సినిమా చెయ్యాలనుకుంటుంది. ఇప్పుడు క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కథకి మైత్రి వారు ఇంప్రెస్స్ అవడంతో బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబోని సెట్ చేసారు మైత్రి నిర్మాతలు.

Gopichand Malineni - Balayya movie on cards

Gopichand Malineni to direct Balayya
gopichand malineni
krack movie
krack blok buster
bb3
boyapati
balayya
balakrishna - gopichand malineni combo