Advertisementt

చరణ్ ని వదిలి పవన్ వెంట పడుతున్న డైరెక్టర్?

Wed 20th Jan 2021 11:43 AM
pawan kalyan,charan,vamsi paidipally,krish movie,harish shnaker movie,ak remake,surender reddi movie  చరణ్ ని వదిలి పవన్ వెంట పడుతున్న డైరెక్టర్?
Is another director going to join Pawan's directors List? చరణ్ ని వదిలి పవన్ వెంట పడుతున్న డైరెక్టర్?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటినుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒప్పేసుకుంటూ ఫాన్స్ కి నిద్ర లేకుండా చేస్తున్నాడు. రాజకీయాలతో రెండేళ్ల గ్యాప్ ని ఇలా సినిమాల మీద సినిమాలు చేసేస్తూ గ్యాప్ ని ఫిల్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం క్రిష్ సినిమా షూటింగ్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నాడు పవన్. అయితే క్రిష్ సినిమాకి ఓ 20 రోజుల గ్యాప్ ఇచ్చి ఏకే రీమేక్ లోకి వెళ్లబోతున్నాడు. శేఖర్ కే చంద్ర దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ అయ్యప్పన్ కోషియమ్ మూవీ షూటింగ్ ఈ నెల 22 నుండి మొదలు కాబోతుంది. దాని కోసం పవన్ లుక్ కూడా చేంజ్ చెయ్యబోతున్నాడు. మరోపక్క హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలు కాచుకుని కూర్చున్నారు.

తాజాగా పవన్ లిస్ట్ లో మరో దర్శకుడు చేరబోతున్నట్టుగా సోషల్ మీడియా న్యూస్. అది మహర్షి తర్వాత మహేష్ నే నమ్ముకున్న వంశి పైడిపల్లి ఆ తర్వాత మహేష్ హ్యాండ్ ఇవ్వడంతో.. తన దగ్గర కథకు మార్పులు చేర్పులు చేసుకుని రామ్ చరణ్ వెనక పడ్డాడు. రామ్ చరణ్ RRR తర్వాత ఆచార్య.. ఆ నెక్స్ట్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీకి రాలేకపోవడంతో వంశి పైడిపల్లి ని లైట్ తీసుకున్నట్టే కనబడుతుంది. దానితో వంశి పైడిపల్లి ఇప్పుడు పవన్ వెనక పడినట్లుగా ఫిలింనగర్ కోడై కూస్తుంది. పవన్ - క్రిష్ సినిమా షూటింగ్ లోనే వంశి పైడిపల్లి పవన్ ని పదే పదే కలిసినట్టుగా తెలుస్తుంది. వంశి గనక పవన్ ని ఇంప్రెస్స్ చెయ్యగలితే రెండుళ్లు ఆగయినా పవన్ సినిమా చేసేలా కనబడుతున్నాడు వంశి పైడిపల్లి అని అంటున్నారు. 

మరి పవన్ ప్రస్తుతం బాగా బిజీ అయినా సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకుంటూ చాలామంది దర్శకనిర్మాతలు వెయిట్ చేయించినట్టుగానే వంశి పైడిపల్లిని వెయిట్ చేయిస్తాడేమో చూడాలి.

Is another director going to join Pawan's directors List?:

Vamsi paidipally to direct Pawan kalyan?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ