Advertisementt

అఖిల్-మోనాల్ ని మళ్ళీ వాడుతున్న స్టార్ మా

Wed 20th Jan 2021 08:36 AM
bigg boss,akhil,monal,start music,new show,anchor suma,star maa  అఖిల్-మోనాల్ ని మళ్ళీ వాడుతున్న స్టార్ మా
Start Music promo goes viral అఖిల్-మోనాల్ ని మళ్ళీ వాడుతున్న స్టార్ మా
Advertisement
Ads by CJ

స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకాదరణ పొందడానికి మెయిన్ కారణం మోనాల్ గజ్జర్ గ్లామర్ దానితో పాటుగా.. మోనాల్ - అఖిల్ మధ్యన ఫ్రెండ్ షిప్ ని స్టార్ మా ప్రేమగా ప్రేక్షకులకి ప్రాజెక్ట్ చేయడమే. లేదంటే ఈ సీజన్ ప్రేక్షకులకి విపరీతంగా బోర్ కొట్టేసేది. మోనాల్ - అఖిల్ మధ్యన ఫ్రెండ్ షిప్ ని కాస్తా ప్రేమగా చూపించడంలో స్టార్ మా సక్సెస్ అయ్యింది. బిగ్ బాస్ కి మంచి టీఆర్పీ తెచ్చకుంది. మోనాల్ ని దత్త పుత్రికలా కాపు కాచింది స్టార్ మా. అందుకే స్టార్ మా లో డాన్స్ ప్లస్ షో లో మోనాల్ అందాల ఆరబోతకు అవకాశం కూడా ఇచ్చింది. అయితే మోనాల్ - అఖిల్ క్రేజ్ కేవలం బిగ్ బాస్ వరకే వాడుకోవడం లేదు.

తాజాగా స్టార్ మా లో సుమ యాంకర్ గా ప్రసారం కాబోయే స్టార్ట్ మ్యూజిక్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరి క్రేజ్ ని వాడడం ఒక ఎత్తైతే.. అఖిల్ - మోనాల్ క్రేజ్ ని వాడడం మరో ఎత్తు. ఈ షో లో అఖిల్, మోనాల్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ను పాడడం విశేషం. ఇక బ్యాగ్రౌండ్ లో మోనాల్.. అఖిలూ అంటూ పిలవడం, సోహెల్.. అఖిల్ కళ్ళు ముయ్యడం,అఖిల్ కి మోనాల్ చేత ఎదో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టుగా బిల్డప్ ఇవ్వడం, సుమ కూడా నానా హంగామా చేస్తూ అఖిల్ - మోనాల్ మధ్యన మళ్ళీ సం థింగ్ సం థింగ్ అనేలా గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. మరి బిగ్ బాస్ లో అఖిల్ - మోనాల్ ని వాడిన స్టార్ మా మరోసారి వారి క్రేజ్ ని ఈ షో కోసం వాడెయ్యబోతుంది. మరి అఖిల్ - మోనాల్ మా మధ్యన ఏం లేదంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నా స్టార్ మా మాత్రం వాళ్ళని వదలడం లేదు.

Start Music promo goes viral :

Akhil - Monal start music latest promo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ