నిన్నమొన్నటివరకు చెల్లెలి నిహారిక పెళ్లి పనులు.. మధ్యలో కరోనా తో కాస్త రెస్ట్ దొరికినా ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలతో ఫుల్ బిజీ. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 షూటింగ్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న వరుణ్ తేజ్ మరో కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో మరో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకోసం చాలా రోజులుగా వరుణ్ తేజ్ కండలు పెంచుతూ జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు. నేడు వరుణ్ తేజ్ పుట్టిన రోజు కానుకగా వరుణ్ తేజ్ - కిరణ్ కొర్రపాటి కాంబో మూవీ ఫస్ట్ లుక్ మాత్రమే కాదు.. టైటిల్ ని కూడా వదిలింది టీం.
వరుణ్ బాక్సింగ్ నేపధ్యమున్న ఫైటర్ లుక్ లో గని గా అదరగొట్టేస్తున్నాడు. నిజమైన ఫైటర్ లా వరుణ్ తేజ్ గని గా బరిలో కిక్ ఇస్తున్నాడు. బాక్సింగ్ బరిలో కిక్ ఇస్తూ ఎదుటి వాడికి చమటలు పట్టించే రీతిలో వరుణ్ గని లుక్ ఉంది. నిజంగా ఈ లుక్ కోసం వరుణ్ ఎంతగా కష్టపడ్డాడో అనేది అప్పుడప్పుడు వరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోస్ తో అర్ధమవుతుంది. వరుణ్ తేజ్ గని లుక్ చూసిన మెగా ఫాన్స్.. అబ్బా వరుణ్ బాక్సర్ గా ఏమున్నాడురా అంటున్నారు.