మహేష్ - పరశురామ్ సర్కారు వారి పాట సినిమా ఎనౌన్స్ చేసి ఆరు నెలలు పైనే అయ్యింది. కానీ ఇంతవరకు మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొనలేదు. సర్కారు వారి పాటలో కీలక ఎపిసోడ్ కోసం అమెరికా షెడ్యూల్ ప్లాన్ చేసి పెట్టుకున్నారు పరశురామ్ అండ్ టీం. అయితే కరోనా సర్కారు వారి పాట కి అడుగడుగునా అడ్డం పడింది. మధ్యలో యూనిట్ వీసా ప్రోబ్లెంస్. అలా అలా సర్కారు వారి పాట షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. అయితే సంక్రాంతి తర్వాత సర్కారు వారి పాట అమెరికా షెడ్యూల్ పక్కన బెట్టి.. ఆ స్థానంలో దుబాయ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంది అన్నారు.
అయితే సర్కారు వారి పాట యూనిట్ అప్ డేట్ ఏం లేకపోయినా.. మహేష్ బాబు ప్రవేట్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ ఎక్కేసి దుబాయ్ వెళ్ళైపోయాడు. మహేష్ ప్రవేట్ ఎయిర్ పోర్ట్ వీడియో సాంఘీక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది. అంటే మహేష్ దుబాయ్ వెళ్లాడంటే.. ఇక యూనిట్ కూడా దుబాయ్ ఫ్లైట్ ఎక్కేస్తుంది. సంక్రాంతి సందడి సద్దుమణగగానే మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ కి చెక్కేసాడు. ఇక పరశురామ్ అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని దుబాయ్ షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నాడు. కీర్తి సురేష్ మిగిలిన నటీనటులు అంతా దుబాయ్ కి వెళ్ళబోతున్నారు. రేపో మాపో సర్కారు వారి పాట షూటింగ్ దుబాయ్ వేదికగా మొదలు కాబోతుంది.