ఏ హీరో ఫాన్స్ అయినా తమ హీరో నటించే సినిమా లుక్ విడుదలైనప్పుడు, టీజర్ రిలీజ్ అయినా, ట్రైలర్ రిలీజ్ అయినా ఉత్సాహం తో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చెయ్యడానికి పోటీ పడుతుంటారు. మా హీరో లుక్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది అంటూ రచ్చ రచ్చ చేస్తారు. అలాగే సినిమాలు విడుదలవుతున్నప్పుడు హీరోల బ్యానేర్స్ కి పాలాభిషేకాలు, కటౌట్స్ కట్టి సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ రౌడీ హీరో ఫాన్స్ అలా కాదు. విజయ్ దేవరకొండ రీసెంట్ పాన్ ఇండియా ఫిలిం లైగర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది టీం. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా లైగర్ లుక్ అండ్ టైటిల్ ని విడుదల చేసిన కొన్ని గంటల్లోనే రౌడీ హీరో ఫాన్స్ విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ మీద పాలాభిషేకాలు, కేక్ కటింగ్స్ అంటూ నానా హంగామా చేసారు.
విజయ్ దేవరకొండ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రౌడీ హీరో అంటూ రౌడీ ఫాన్స్ లైగర్ ఫస్ట్ లుక్ కి పాలాభిషేకాలు చెయ్యడమే కాదు.. ఏకంగా చేతి మీద లైగర్ టైటిల్ ని పచ్చ బొట్టుగా వేయించుకుని రౌడీ హీరో మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరి పాలాభిషేకాలు, కటౌట్స్ వరకు ఒకే.. కానీ రౌడీ హీరో క్రేజీ ఫాన్స్ మాత్రం ఇలా పచ్చ బొట్లు పొడిపించుకోవడం మాత్రం నిజంగా హాట్ టాపిక్కే. దీనితో విజయ్ క్రేజ్ అభిమానుల్లో ఎంతగా ఉందొ అర్ధమవుతుంది. కరోనా క్రైసిస్ తర్వాత మళ్ళీ షూటింగ్ పునః ప్రారంభించుకున్న లైగర్ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే జత కడుతుంది.