Advertisementt

రష్మిక-విజయ్ మధ్యన ఆసక్తికర ట్వీట్స్

Mon 18th Jan 2021 04:40 PM
rashmika mandanna,vijay devarakonda,tweets,liger first look  రష్మిక-విజయ్ మధ్యన ఆసక్తికర ట్వీట్స్
Interesting tweets between Rashmika-Vijay రష్మిక-విజయ్ మధ్యన ఆసక్తికర ట్వీట్స్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నలు గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించడమే కాదు.. వీరి మధ్యన మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉంది.ఎంతలా అంటే విజయ్ దేవరకొండ కొత్తింటి గృహప్రవేశానికి రశ్మికాని తప్ప ఎవ్వరిని పిలవనంత. దానితోనే విజయ్ దేవరకొండ కి రశ్మికకి మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే అదంతా పక్కన బెడితే ఇప్పుడు విజయ్ - రశ్మికల మధ్యన నడిచిన ట్వీట్స్ మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. అది కూడా విజయ్ నటిస్తున్న లైగర్ ఫస్ట్ లుక్ పై రష్మిక చేసిన కామెంట్స్ పై విజయ్ ఆసక్తికరంగా స్పందించడం.

విజయ్ దేవరకొండ - పూరి కాంబో లైగర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది. టీం. ఆ పోస్టర్ చూసిన రష్మిక చాలా గర్వాంగా ఉంది విజయ్. కిల్ల‌ర్ పోస్ట‌ర్ అంటూ.. ఈ మాస్ట‌ర్ పీస్‌ని స్క్రీన్ మీద చూసేందుకు చాలా ఆస‌క్తిగా ఉన్నా. అప్పుడు థియేటర్ లో లేచి విజిల్స్ వేస్తూ డ్యాన్స్ వేస్తా. నా స్వీట్ బీస్ట్‌ల‌కు ఆల్ ది బెస్ట్ అంటూ ర‌ష్మిక ట్వీట్ చెయ్యగా.. దానికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ..రశ్మికాని స్వీట్ గా రుషీ అంటూ సంభోదిస్తూ నీతో పాటు థియేట‌ర్ల‌లో చాలా మంది నిల్చుంటారని ప్రామిస్ చేస్తున్నా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కొత్త స్ట‌ఫ్‌ని చూశావు క‌దా అంటూ రీ ట్వీట్ చెయ్యడం అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. మరి ఈ ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యన జరిగిన ఈ ట్వీట్స్ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి కదూ..

Interesting tweets between Rashmika-Vijay:

Rashmika tweet on Vijay Devarakonda's Liger First look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ